89runs | మ్యాచ్ పాయే.. జ‌రిమానా ప‌డే..

89runs | మ్యాచ్ పాయే.. జ‌రిమానా ప‌డే..

89runs | ఆంధ్ర‌ప్ర‌భ వెబ్‌డెస్క్ : ఐపీఎల్ 2026 సీజన్‌లో చెన్నై సూపర్ కింగ్స్ దారుణ‌మైన ఓట‌ముల‌తో ఇంటి దారి ప‌ట్టింది. ఈ సీజ‌న్‌లో ప్లేఆఫ్స్‌కు చేరుకోలేక‌పోయింది. నిన్న (గురువారం) గుజరాత్ టైటాన్స్‌తో జ‌రిగిన మ్యాచులోనూ ఓట‌మిపాలైంది. చెన్నై ఐపీఎల్ చరిత్రలోనే 89 పరుగుల భారీ తేడాతో పెద్ద ఓటమిగా నమోదైంది. మ్యాచ్ పోయింద‌నుకుంటే చెన్నైకి మ‌రో బిగ్ షాక్ త‌గిలింది. స్లో ఓవర్ రేట్ కారణంగా కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్‌తో పాటు మొత్తం జట్టుపై బీసీసీఐ భారీ జరిమానా విధించింది. ఇది వారికి రెండో స్లో ఓవర్ రేట్ ఉల్లంఘన. అంతకుముందు 18వ మ్యాచ్‌లోనూ సీఎస్కే తొలిసారి ఈ తప్పిదానికి పాల్పడింది.దీంతో ఈ ఉల్లంఘన కారణంగా కెప్టెన్ గైక్వాడ్‌పై రూ.24 లక్షలు, మిగతా ప్లేయింగ్ ఎలెవన్, ఇంపాక్ట్ ప్లేయర్ కార్తీక్ శర్మపై రూ.6 లక్షలు లేదా వారి మ్యాచ్ ఫీజులో 25 శాతం జరిమానా పడింది.

Leave a Reply