మన జనగణన.. మన భవిష్యత్తు

మన జనగణన.. మన భవిష్యత్తు

  • మే 30లోపు ఇంటి వివరాలు నమోదు చేసుకోవాలి
  • సంక్షేమ పథకాల అమలులో సమాచారం కీలకం
  • జనాభా గణనలో ప్రతి కుటుంబం భాగస్వామ్యం కావాలి
  • ఎన్యుమరేటర్లకు పూర్తి సహకారం అందించాలి: కలెక్టర్

తిరుపతి ప్రతినిధి, ఆంధ్రప్రభ: మన జనగణన – మన వికాసం అనే నినాదంతో ప్రతి ఒక్కరూ చైతన్యంతో ముందుకు వచ్చి ఈ చివరిలోపు తమ ఇంటి వివరాలు నమోదు చేయించుకోవాలని కలెక్టర్ వెంకటేశ్వర్ పిలుపునిచ్చారు. గురువారం ఒక ఒక ప్రకటనలో పేర్కొంటూ.. జనగణన–2027 తొలి దశ అయిన ఇళ్ల జాబితా, ఇళ్ల గణన కార్యక్రమంలో ప్రతి కుటుంబం తప్పనిసరిగా భాగస్వామ్యం విజ్ఞప్తి చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా కొనసాగుతున్న ఈ కార్యక్రమంలో ప్రజలు పూర్తి సహకారం అందించాలని ఆయన కోరారు. రాష్ట్రంలో కొనసాగుతున్న ఇళ్ల జాబితా, ఇళ్ల గణన కార్యక్రమంలో భాగంగా ఎన్యుమరేటర్ల క్షేత్ర పర్యటన ఈ నెల 30వ తేదీతో ముగియనున్న నేపథ్యంలో, ఇంకా తమ ఇంటి వివరాలు నమోదు చేయించుకోని కుటుంబాలు వెంటనే స్పందించాలని కలెక్టర్ సూచించారు. ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలు అర్హులైన ప్రతి కుటుంబానికి చేరాలంటే జనాభా గణనలో ఖచ్చితమైన వివరాలు నమోదు కావడం అత్యంత అవసరమని తెలిపారు. ప్రజలు తమ ఇంటికి వచ్చే ఎన్యుమరేటర్లకు అందుబాటులో ఉండి సరైన సమాచారాన్ని అందించాలని కోరారు. జనాభా గణన కేవలం ప్రభుత్వ కార్యక్రమం మాత్రమే కాకుండా దేశాభివృద్ధికి పునాది వంటిదని జిల్లా కలెక్టర్ పేర్కొన్నారు.

జనాభా, నివాసాలు, కుటుంబ పరిస్థితులపై సేకరించే సమాచారం ఆధారంగానే భవిష్యత్తు అభివృద్ధి ప్రణాళికలు రూపొందించబడతాయని తెలిపారు. మన జనగణన – మన వికాసం అనే నినాదంతో ప్రతి ఒక్కరూ చైతన్యంతో ముందుకు వచ్చి ఈ చివరిలోపు తమ ఇంటి వివరాలు నమోదు చేయించుకొని రాష్ట్ర, దేశ అభివృద్ధిలో భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. జనాభా గణనకు సంబంధించి ఏవైనా సందేహాలు ఉంటే 1855 హెల్ప్‌లైన్ నంబర్‌ను సంప్రదించాలని సూచించారు.

Leave a Reply