గంజాయి దొరికితే కఠిన చర్యలు…

ధర్మపురి, ఆంధ్రప్రభ ; మండలం పరిధిలో గంజాయి అమ్మిన వాడకం చేసిన చట్ట రీత్యా కఠిన చర్యలు తీసుకుంటామని ధర్మపురి ఎస్ఐ గురక మహేష్ హెచ్చరించారు. గురువారం ధర్మపురి పట్టణంలో జగిత్యాల జిల్లా ఎస్పీ అశోక్ కుమార్ ఆదేశాల మేరకు, జగిత్యాల డీఎస్పీ పురుషోత్తం రెడ్డి సూచనలతో, ధర్మపురి సర్కిల్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ ఎలపాటి రాంనర్సింహ రెడ్డి ఆధ్వర్యంలో ధర్మపురి ఎస్సై మహేష్ పోలీస్ సిబ్బంది ట్రెయిన్డ్ డాగ్ స్క్వాడ్ సహాయంతో గంజాయి, ఇతర నిషేధిత మాదక ద్రవ్యాల కోసం విస్తృత తనిఖీలు చేపట్టారు.

ఈ సందర్భంగా ఎస్ఐ మహేష్ మాట్లాడుతూ.. జగిత్యాల జిల్లా పోలీస్ శాఖ ఆధ్వర్యంలో మాదక ద్రవ్యాల నిర్మూలన కోసం ప్రత్యేక చర్యలు కొనసాగుతున్నాయని జిల్లా వ్యాప్తంగా అంటి డ్రగ్స్,నార్కొట్ ప్రత్యేక సిబ్బంది బృందాలు గా ఏర్పడి ట్రెయిన్డ్ డాగ్ స్క్వాడ్ సహాయంతో ప్రతి మండలంలోని ప్రధాన ప్రాంతాలలో విస్తృత తనిఖీలు నిర్వహిస్తున్న నేపథ్యంలో, ధర్మపురి పట్టణంలోని ప్రధాన కిరాణా దుకాణాలు, టీ స్టాళ్లు, పాన్ షాపులు, అనుమానాస్పద ప్రాంతాలలో ప్రత్యేక తనిఖీ చేస్తున్నారు అని అందులో భాగంగా ధర్మపురి లో ప్రత్యేక తనిఖీ చేశామని తెలిపారు యువతకు ప్రత్యేక అవగాహన కల్పించారు.

గంజాయి వంటి మాదక ద్రవ్యాలు యువత భవిష్యత్తును నాశనం చేస్తాయని, ఆరోగ్యంతో పాటు కుటుంబ మరియు సామాజిక జీవితాలపై తీవ్ర ప్రభావం చూపుతాయని తెలిపారు. అలాంటి నిషేధిత పదార్థాలకు దూరంగా ఉండాలని, ఎవరైనా గంజాయి విక్రయాలు లేదా వినియోగం నిర్వహిస్తున్నట్లు తెలిసిన వెంటనే పోలీసులకు సమాచారం అందించాలని సూచించారు.జిల్లాలో మాదక ద్రవ్యాల నిర్మూలన కోసం ప్రత్యేక నిఘా కొనసాగుతుందని, గంజాయి విక్రయాలు, రవాణా లేదా వినియోగంలో పాల్గొనే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని పోలీసులు హెచ్చరించారు.ఈ కార్యక్రమంలో పోలీసులు సిబ్బంది పాల్గొన్నారు
