రాజీవ్‌గాంధీ సేవలు మరువలేనివి

రాజీవ్‌గాంధీ సేవలు మరువలేనివి
తాడ్వాయి, ఆంధ్రప్రభ:
ఆధునిక భారతదేశ నిర్మాణానికి మాజీ ప్రధానమంత్రి రాజీవ్‌గాంధీ చేసిన సేవలు మరువలేనివని తాడ్వాయి మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు బొల్లు దేవేందర్ ముదిరాజ్ అన్నారు. మండల కేంద్రంలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో రాజీవ్‌గాంధీ వర్ధంతి కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి పార్టీ శ్రేణులు ఘనంగా నివాళులర్పించారు.
ఈ సందర్భంగా దేవేందర్ ముదిరాజ్ మాట్లాడుతూ.. రాజీవ్‌గాంధీ ప్రధానమంత్రిగా ఉన్న కాలంలో వెనకబడిన వర్గాల అభ్యున్నతి కోసం ఎంతో కృషి చేశారని పేర్కొన్నారు. దేశంలో సాంకేతిక విప్లవానికి నాంది పలికింది రాజీవ్ గాంధీనే అని, ప్రపంచంలో అభివృద్ధి చెందుతున్న దేశాల సరసన భారతదేశాన్ని నిలిపిన ఘనత ఆయనదేనని గుర్తుచేశారు.
ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షులు ఇప్ప నాగేశ్వర్రావు, మండల వర్కింగ్ ప్రెసిడెంట్ ముదురుకోళ్ల తిరుపతి, కాంగ్రెస్ పార్టీ జిల్లా కార్యదర్శి ఈర్ప సునీల్ దొర, మాజీ ట్రస్ట్ బోర్డు చైర్మన్ అరేం లచుపటేల్ పాల్గొన్నారు. అలాగే మహిళా అధ్యక్షురాలు సరిత, పాక రాజేందర్, పాక సాంబయ్య, నునవత్ శ్రీనివాస్, సర్పంచ్‌లు వెంకటేశ్వర్లు, శ్రీను, వివిధ గ్రామాల సర్పంచ్‌లు, సీనియర్ నాయకులు మరియు కార్యకర్తలు ఈ నివాళులర్పించిన వారిలో ఉన్నారు.
