FormerCM | హత్యలు, కుట్రలతో చంద్రబాబు రాజకీయాలు

FormerCM | ఆంధ్రప్రభ, వెబ్‌డెస్క్ : టీడీపీ పాలనలోనే వివేకా బాబాయ్ హత్య జరిగిందని, చంద్రబాబు హత్యలు, శవాలు, కుట్రలతో రాజకీయాలు చేస్తున్నారని వైసీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అన్నారు. తాడేపల్లిలో ఆయన మీడియాతో మాట్లాడుతూ…రూ.1200 కోట్లతో అసెంబ్లీ, హైకోర్టు, సెక్రటేరియట్ ఉన్నా.. పర్మినెంట్ పేరిట మళ్లీ అన్నీ కొత్తగా కడతానంటున్నారన్నారు. మళ్లీ ఇవే నిర్మాణాలకు కొత్త టెండర్లు పిలిచారు.. కానీ, పాత వాళ్లకే టెండర్లు కట్టబెట్టారన్నారు. కొత్తగా నిర్మిస్తున్న ఐదు బిల్డింగుల దోపిడీ చూసి జనం నివ్వెరపోతున్నారన్నారు.
భవన డిజైన్లకే రూ.401 కోట్లు ఖర్చు చేశారన్నారు. ఈ ఐదు బిల్డింగులకు అయ్యే మొత్తం ఖర్చు రూ.10,665 కోట్లు.. అంటే ప్రస్తుతం చదరపు అడుగుకు రూ.20,427 ఆ? పాత లెక్క రూ. 5వేల లోపే ఉందన్నారు. వాటి ఫర్నీచర్, ఇంటీరియర్ ఇంకా అదనపు ఖర్చులన్నమాట.. అంటే ఇప్పుడు చదరపు దాటుతుందన్నమాట అన్నారు. ఫైవ్ స్టార్ హంగులతో కూడా చదరపు అడుగు రూ.4,500 లోపే అవుతుందన్నారు.
తెలంగాణలో రూ.615 కోట్లతో కేసీఆర్ సచివాలయం కట్టారు. మన సెక్రటేరియట్ కు మాత్రం ఇంత ఖర్చా? ఎందుకు ?? కొత్త అసెంబ్లీ, కొత్త హైకోర్టు అంటూ మళ్లీ భారీగా ఖర్చు చేయబోతున్నారు. ఇదంతా విచ్చలవిడిగా చేస్తున్న దోపిడీనే అన్నారు. మావిగన్ అంటే చంద్రబాబుకి గుండె ఆగిపోయేలా ఉందన్నారు. చంద్రబాబు సీఎంగా ఉండడం ఏపీ చేసుకున్న దురదృష్టమన్నారు. ఏపీకి రాజధాని లేకుండా చేస్తున్నారన్నారు. చంద్రబాబు నిర్ణయాలతో భవిష్యత్తులో కూడా రాజధాని లేకుండా చేస్తున్నారన్నారు. రోడ్లు, నీరు, డ్రైనేజీ, మౌలిక సదుపాయాలకే రూ.2 లక్షల కోట్లు ఖర్చవుతుందన్నారు. ఆచరణ సాధ్యం కాదని తెలిసినా ముందుకు వెళ్తున్నారన్నారు. స్కామ్ ల కోసమే చంద్రబాబు ముందుకు వెళ్తున్నారు.
ఇప్పటికే అమరావతి కోసం రూ.47, 387 కోట్ల అప్పుచేశారన్నారు. ఖజానా నుంచి రూ.9,200 కోట్లు ఖర్చు చేయబోతున్నారన్నారు. స్కామ్ కోసం రాష్ట్ర ప్రజల వెన్ను విరుస్తున్నారన్నారు. ప్రశ్నిస్తే చంద్రబాబుకి బీపీ పెరుగుతోందన్నారు. రాజధాని ఉండాలనే మావిగన్ ప్రతిపాదించామన్నారు. రాష్ట్ర పరిస్థితుల దృష్ట్యా మావిగన్ ను ప్రత్యామ్నాయంగా చూపించామన్నారు. అమరావతి అయితే జీరో నుంచి మొదలుపెట్టాలన్నారు.
మావిగన్ లో అన్నీ ఉన్నాయన్నారు. ప్రజలు కూడా మావిగన్ కు మద్దతు పలికారన్నారు. అది తట్టుకోలేకనే చంద్రబాబు ఇష్టమొచ్చినట్లు మాట్లాడుతున్నారన్నారు. తాను మాట్లాడిందే కాకుండా మంత్రులతో బూతులు మాట్లాడిస్తున్నారన్నారు. ఏపీ ప్రజలు అష్టకష్టాలు పడుతున్నారన్నారు. ఇచ్చిన హామీలకు చంద్రబాబు వెన్నుపోటు పొడిచారన్నారు. ప్రజల బాగోగులను గాలికి వదిలేశారన్నారు.
రాష్ట్రాన్ని జంగిల్ రాజ్ మార్చేశారన్నారు. ఎవరైనా ప్రశ్నిస్తే కేసులతో అణగదొక్కుతున్నారన్నారు. రెండేళ్లలో ఏం మంచి చేశారో చంద్రబాబు చెప్పాలన్నారు. ఈ రెండేళ్లలో బాబు ప్రొగ్రెస్ ఒక్కటే.. “చంద్రబాబు షూరిటీ మోసం గ్యారంటీ” అన్నారు. రాష్ట్రంలో విచ్చలవిడిగా అవినీతి, దోపిడీ జరుగుతోందన్నారు. చంద్రబాబు మాత్రం డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నారన్నారు. తప్పులను ప్రశ్నిస్తే ఆయనకు బీపీ పెరుగుతోందన్నారు.
