Massive Fire | 8 ఫైర్ ఇంజిన్లతో…

Massive Fire | ఆంధ్రప్రభ, వెబ్‌డెస్క్ : హైదరాబాద్‌లోని చార్మినార్ సమీపంలో భారీ అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. మదీనా చౌరస్తా వద్ద ఉన్న ఎస్‌వైజే కాంప్లెక్స్‌లోని ఓ బట్టల దుకాణంలో ఇవాళ ఉదయం ఒక్కసారిగా మంటలు చెలరేగడంతో స్థానికులు భయాందోళనకు గురయ్యారు.
దుకాణం నుంచి భారీగా పొగలు, మంటలు ఎగసిపడటంతో స్థానికులు వెంటనే అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించారు. అగ్నిప్రమాదం కారణంగా ఆ ప్రాంతమంతా దట్టమైన పొగతో కమ్ముకుంది.
సమాచారం అందుకున్న ఫైర్ సిబ్బంది హుటాహుటిన ఘటనాస్థలానికి చేరుకుని మంటలను అదుపులోకి తెచ్చేందుకు ప్రయత్నిస్తున్నారు. దాదాపు రెండు గంటలుగా 8 ఫైర్ ఇంజిన్లతో అగ్నిమాపక సిబ్బంది శ్రమిస్తున్నప్పటికీ.. మంటలు భారీగా వ్యాపించడంతో అదుపు చేయడం కష్టంగా మారింది. ప్రమాదానికి గల పూర్తి కారణాలు తెలియాల్సి ఉంది.
