జోరందుకున్న ఉపాధి హామీ పనులు..

జోరందుకున్న ఉపాధి హామీ పనులు..

  • పని ప్రదేశాల్లో కనీస సౌకర్యాలు ఏవి?
  • టెంట్లు, ఓ ఆర్ ఎస్ ప్యాకెట్లు లేవు..
  • ఎండ తీవ్రతకు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్న కూలీలు..

ఎల్కతుర్తి, ఆంధ్రప్రభ : మండల వ్యాప్తంగా ఉపాధి పనులు జోరందుకున్నాయి వ్యవసాయ పనులు తగ్గడంతో గ్రామాల్లో పెద్ద సంఖ్యలో కూలీలు ఉపాధి పనులకు హాజరవుతున్నారు. చెరువులు కుంటలో భూగర్భ జలాల పెంపు కోసం వర్షపు నీటిని ఒడిసి పట్టేందుకు గుంతలు తీయడం గుట్టల కింద ఇంకుడు గుంతలు తీయడం లాంటి పనులు చేపడుతున్నారు. గతంలో లాగా పనుల్లో అవకతవకలు జరగకుండా ఉండేందుకు ప్రభుత్వం తీసుకువచ్చిన నూతన సాంకేతిక పద్ధతిని ఉపయోగిస్తూ ఫీల్డ్ అసిస్టెంట్లు ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నారు.

ప్రత్యేక యాప్ ద్వారా ముందుగా ఉదయం పనులకు వచ్చిన వారి ఫోటోలు తీయడంతో పాటు పనులు పూర్తయిన తర్వాత మరో దపా ఫోటోలు తీసి సంభందిత ప్రభుత్వ పోర్టల్ లో నిక్షిప్తం చేస్తున్నారు. పనులు చేపట్టి వారాలు గడుస్తున్న నేటి వరకు కూడా నీడ కోసం టెంట్లు వేయకపోవడంతో కూలీలు ఎండ తీవ్రతకు తట్టుకోలేక తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. అధికారులు నిత్యం పర్యవేక్షణ చేస్తూ పని ప్రదేశాల్లో కనీస వసతులక కల్పనకు కృషి చేయాలని వడదెబ్బ తగలకుండా ఒఆర్ఎస్ ప్యాకెట్లు, ఫస్ట్ ఎయిడ్ కిట్లు అందుబాటులో ఉంచాలని కూలీలు అధికారులను కోరుతున్నారు.

Leave a Reply