భీమ్‌గల్ కాంగ్రెస్ మండల అధ్యక్షుడిగా మల్లెల లక్ష్మణ్

భీమ్‌గల్ టౌన్, ఆంధ్రప్రభ : భీమ్‌గల్ మండల కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులుగా మాజీ సర్వ సమాజ్ కమిటీ అధ్యక్షులు మల్లెల లక్ష్మణ్ నియామకం అయ్యారు. జిల్లా వ్యాప్తంగా పలు మండలాల పార్టీ అధ్యక్షులు, పట్టణ అధ్యక్షులను నియమిస్తూ ఆదివారం కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులు కాటిపల్లి నాగేష్ రెడ్డి ఉత్తర్వులు జారీ చేశారు. పార్టీ మండల అధ్యక్షులుగా మల్లెల లక్ష్మణ్, పట్టణ అధ్యక్షులుగా పర్శ అనంత్ రావు లను నియమించారు. ఈ సందర్బంగా మల్లెల మాట్లాడుతూ తనను మండల అధ్యక్షులుగా ఎంపిక చేసిన నాయకులకు కృతజ్ఞతలు తెలిపారు. మండలంలో కాంగ్రెస్ పార్టీ బలోపేతం ధ్యేయంగా పని చేస్తానని అన్నారు. తనపై నమ్మకం ఉంచి బాధ్యతలు అందజేసిన నాయకులకు, కార్యకర్తలకు కృతజ్ఞతలు తెలిపారు.

Leave a Reply