కష్టపడి చదివి ఉన్నత స్థాయికి ఎదగాలి

తొర్రూరు, ఆంధ్రప్రభ : విద్యార్థులు కష్టపడి చదివి ఉన్నత స్థాయికి ఎదగాలని గుర్తురు సర్పంచ్ విస్సంపల్లి కవిత బాలకృష్ణ అన్నారు.మండలంలోని గుర్తురు గ్రామంలో ఉన్న తెలంగాణ మోడల్ స్కూల్ మరియు జూనియర్ కళాశాలలో ఉత్తమ ప్రతిభ కనపర్చిన విద్యార్థులను ఆదివారం సన్మానించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ విద్యార్థులు కష్టపడి చదివి ఉన్నత స్థాయికి ఎదగాలని, మండల స్థాయిలో ఈ మోడల్ స్కూల్ పేరు గుర్తింపు తీసుకురావడం అభినందనీయమన్నారు. పదవ తరగతిలో అత్యుత్తమ ప్రతిభను కనబరిచిన మండల టాపర్ లు కావ్య శ్రీ, మనుశ్రీ లకు 6వ వార్డు సభ్యుడు సింగారం మురళి ఒక్కొక్కరికి రూ.1116 నగదును బహుమతిగా అందజేశారు. ఈ కార్యక్రమంలో పాఠశాల హెచ్ఎం, ఉపాధ్యాయ బృందం, విద్యార్థులు, తల్లిదండ్రులు తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply