సైబ‌ర్ పోలీసుల‌కు ఫిర్యాదు

సైబ‌ర్ పోలీసుల‌కు ఫిర్యాదు

ఆంధ్ర‌ప్ర‌భ వెబ్‌డెస్క్ : ఐబొమ్మ, బప్పం వెబ్‌సైట్లు మళ్లీ ప్ర‌త్య‌క్షం కావ‌డంపై క‌ల‌క‌లం రేపింది. పైర‌సీ సినిమాల స్ట్రీమింగ్ వెబ్‌సైట్ ఐబొమ్మ‌పై తెలుగు ఫిల్మ్ ఛాంబ‌ర్ ఆఫ్ కామ‌ర్స్ ప్ర‌తినిధులు సైబ‌ర్ పోలీసుల‌కు ఫిర్యాదు చేశారు. ఐబొమ్మ‌, బ‌ప్పం టీవీ పేర్ల‌తో కొత్త సినిమాలు అక్ర‌మంగా ప్ర‌సారం చేస్తున్నార‌ని, బెట్టింగ్ యాప్స్‌ను ప్ర‌మోట్ చేస్తున్నార‌ని తెలిపారు. సైట్ నిర్వాహ‌కుల‌పై కేసు న‌మోదు చేసి క‌ఠిన చ‌ర్య‌లు తీసుకోవాల‌ని కోరారు. మ‌రో వైపు ఈ సైట్ల‌తో త‌న‌కు సంబంధం లేద‌ని ఇమంది ర‌వి చెప్పిన‌ట్లు స‌మాచారం.

ఐబొమ్మ, బప్పం వెబ్‌సైట్లు మళ్లీ వెలుగులోకి వచ్చాయి. గతంలో పోలీసులు ఐబొమ్మ నిర్వాహకుడు ఇమంది రవిని అరెస్టు చేసి…అతనితోనే వైబ్‌సైట్లు క్లోజ్‌ చేయించారు. ఇప్పుడు మళ్లీ ఐబొమ్మ, బప్పం వెబ్‌సైట్లలో సినిమాలు రావడం సినివర్గాల్లో కలవరం రేపుతుంది. ఈ నేపథ్యంలోనే సినిమా పైరసీపై తెలుగు ఫిల్మ్‌ఛాంబర్ మళ్లీ ఫిర్యాదు చేసింది. ఫిల్మ్‌ఛాంబర్ ఫిర్యాదుతో సినిమాల పైరసీపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

Leave a Reply