రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి ..

రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి ..
చౌటుప్పల్, ఆంధ్రప్రభ : చౌటుప్పల్ మండలంలోని తూప్రాన్పేట్ గ్రామ పరిధిలో జరిగిన రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడి, ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న ఒక గుర్తుతెలియని వ్యక్తి (49) మృతి చెందినట్లు చౌటుప్పల్ పోలీస్ ఇన్స్పెక్టర్ జి. మన్మధ కుమార్ తెలిపారు. ఈ నెల 12వ తేదీన తూప్రాన్పేట్ గ్రామ పరిధిలో జరిగిన రోడ్డు ప్రమాదంలో సదరు వ్యక్తి తీవ్రంగా గాయపడ్డారు. ప్రమాదం జరిగిన వెంటనే ఆయన్ను చికిత్స నిమిత్తం నల్గొండ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.
అక్కడ చికిత్స పొందుతూ పరిస్థితి విషమించడంతో శుక్రవారం రాత్రి ప్రాణాలు కోల్పోయారు. మృతదేహాన్ని నల్లగొండ ప్రభుత్వ ఆసుపత్రిలోని మార్చురీ రూమ్లో భద్రపరిచారు. మృతి చెందిన వ్యక్తికి సంబంధించిన ఎలాంటి వివరాలు లభించకపోవడంతో పోలీసులు గుర్తింపు ప్రక్రియను చేపట్టారు. ఈ వ్యక్తికి సంబంధించిన వివరాలు, బంధువులు లేదా స్నేహితుల సమాచారం తెలిసిన వారు ఎవరైనా ఉంటే వెంటనే చౌటుప్పల్ పోలీసులను సంప్రదించాలని కోరారు. సదరు వ్యక్తి గుర్తింపునకు సంబంధించి ఎలాంటి సమాచారం ఉన్నా చౌటుప్పల్ పోలీస్ స్టేషన్, ఎస్సై ఎస్ కృష్ణ మాల్, సెల్ 8712662505 కు తెలపాలని కోరారు.
