ఇంటర్ ప్రథమ సంవత్సర ప్రవేశాలకు దరఖాస్తులు ఆహ్వానం

ఇంటర్ ప్రథమ సంవత్సర ప్రవేశాలకు దరఖాస్తులు ఆహ్వానం
బెజ్జంకి, ఆంధ్రప్రభ: బెజ్జంకి మండలంలోని మోడల్ జూనియర్ కాలేజీ 2026–27 విద్యా సంవత్సరానికి ఇంటర్మీడియట్ ప్రథమ సంవత్సర ప్రవేశాలకు దరఖాస్తులను ఆహ్వానించింది.
పదవ తరగతి ఉత్తీర్ణులైన విద్యార్థులు MPC, BiPC, CEC, ACE గ్రూపులలో ప్రవేశం పొందవచ్చు. ప్రతి గ్రూపులో 40 సీట్లు ఉన్నాయి. దరఖాస్తులు పూర్తిగా ఉచితం https://tgms.telangana.gov.in వెబ్సైట్ ద్వారా ఆన్లైన్లో సమర్పించుకోవాలి.
ప్రిన్సిపాల్ డా. సంగీత సూచించినట్లుగా, గడువు ముగియకముందే విద్యార్థులు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని కోరారు.
