యువత చెడు వ్యసనాల నుంచి దూరంగా ఉండాలి

యువత చెడు వ్యసనాల నుంచి దూరంగా ఉండాలి

  • సీఐ రవి కుమార్

భీమారం, ఆంధ్రప్రభ: యువతకు గంజాయి, డ్రగ్స్, సిగరెట్ వంటి చెడు వ్యసనాల నుంచి దూరంగా ఉండాలని కాకతీయ యూనివర్సిటీ పోలీస్ స్టేషన్ సీఐ రవికుమార్ పిలుపునిచ్చారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. గత 20 రోజులుగా ప్రతి సాయంత్రం 6 నుంచి 9 గంటల వరకు భీమారం బస్ స్టాప్, చింతగట్టు క్యాంప్, ఎర్రగట్టుగుట్ట క్రాస్, గోపాలపురం కల్లు మండువా జంక్షన్లలో తనతో ఇద్దరు ఎస్ఐలు కలిసి నిరంతర గస్తీ నిర్వహిస్తున్నారని. పలు పాన్ డబ్బాలు, కిరాణా షాపుల్లో గుంపులుగా ఉన్న యువకులకు, సిగరెట్ తాగుతున్న వారికి కౌన్సిలింగ్ కూడా అందిస్తున్నారు.

రవికుమార్ సూచించినట్లుగా, యువత సిగరెట్, గంజాయి మత్తుకు బానిసలు కాకుండా, తమ ఉజ్వల భవిష్యత్తును నాశనం చేసుకోకుండా జాగ్రత్తగా ఉండాలి.

Leave a Reply