జొన్నల కొనుగోలు కేంద్రాన్ని ఏర్పాటు చేయండి

జొన్నల కొనుగోలు కేంద్రాన్ని ఏర్పాటు చేయండి

ముధోల్ ఎమ్మెల్యే పవర్ రామారావు పటేల్ కు వినతి పత్రాన్ని అందజేస్తున్న నాయకులు రైతులు

కుంటాల, ఆంధ్రప్రభ : రైతులు ఆరుగాలం శ్రమించి కష్టపడి పండించిన పంటలకు వెంటనే కొనుగోలు కేంద్రాలను ప్రారంభించాలని కోరుతూ గురువారం ముధోల్ ఎమ్మెల్యే పవర్ రామారావు పటేల్ కు కుంటాల మండలంలోని లింబ కె గ్రామానికి చెందిన స్థానిక నాయకులు రైతులు కలిసి ఆయనకు వినతి పత్రాన్ని అందజేశారు.

ఈ సందర్భంగా లింబ కె గ్రామంలోని జొన్నల కొనుగోలు కేంద్రాన్ని ఏర్పాటు చేయాలని అధికంగా కుంటాల మండల వ్యాప్తంగా జొన్నలు అధికంగా పండించడం జరిగిందని ఈదురుగాళ్ల బీభత్సం తో పాటు గాలివాన బీభత్సంతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని ఎమ్మెల్యే దృష్టికి తీసుకువెళ్లారు వెంటనే కొనుగోలు కేంద్రాలు ప్రారంభిస్తే రైతులకు మేలు జరుగుతుందని రాబోయే యాసంగి పంటల వేల దగ్గర పడిందని దీంతో ఇబ్బందులు ఎదుర్కోవాల్సిన పరిస్థితి వస్తుందని ఇప్పటివరకు మొక్కజొన్న కొనుగోలను సైతం వేగవంతం చేపట్టడం లేదని దీంతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని గన్నిసంచుల కొరతతో ఇబ్బందులు పడుతున్నామని ఎమ్మెల్యే దృష్టికి వివరించారు.

దీంతో సానుకూలంగా స్పందించిన ఎమ్మెల్యే పవర్ రామారావు పటేల్ రైతులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా తనవంతు సహాయ సహకారాలు కృషిచేసి రైతులకు అండగా ఉంటానని పేర్కొన్నారు. మొక్కజొన్నతో పాటు కొనుగోలను వేగవంతంగా చేపట్టే విధంగా సంబంధిత కలెక్టర్, వ్యవసాయ శాఖ మంత్రి దృష్టికి తీసుకు వెళ్తామని హామీ ఇచ్చినట్టు పేర్కొన్నారు. అదేవిధంగా జొన్నల కొనుగోలు కేంద్రాన్ని సైతం రైతులకు ఇబ్బంది లేకుండా మద్దతు ధర కల్పించేందుకు ప్రారంభించే చర్యలు తీసుకుంటామని ఆయన రైతులకు హామీ ఇచ్చినట్టు స్థానిక నాయకులు రైతులు తెలిపారు.

Leave a Reply