కారు అదుపుతప్పి బోల్తా.. బాలుడు మృతి

కారు అదుపుతప్పి బోల్తా.. బాలుడు మృతి

రేగొండ, ఆంధ్రప్రభ: భూపాలపల్లి ప్రధాన రహదారిపై రేగొండ మండలం నారాయణపూర్ గ్రామ శివారులో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ బాలుడు మృతి చెందిన విషాద ఘటన బుధవారం చోటుచేసుకుంది.

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. నడికూడ గ్రామానికి చెందిన వూర హిమాంశ్ (9) తన కుటుంబ సభ్యులతో కలిసి బంధువుల పెళ్లికి వెళ్లి తిరిగి ఇంటికి వస్తున్నాడు. వారు మాదారపు భాస్కర్‌రావు నడుపుతున్న ఏపీ15 బీఎండీ 2345 నంబర్ గల కారులో ప్రయాణిస్తున్నారు.

మధ్యాహ్నం రెండు గంటల సమయంలో రేగొండ మండలం నారాయణపూర్ గ్రామ శివారులోని ఎన్‌హెచ్ 353సీ సమీపానికి చేరుకోగానే కారు అదుపుతప్పి బోల్తాపడింది. ఈ ప్రమాదంలో కారులో ఉన్న వారందరూ గాయపడ్డారు. వెంటనే వారిని ఎన్‌ఎస్‌ఆర్ ఆసుపత్రికి తరలించి చికిత్స అందించారు.

తీవ్రంగా గాయపడిన హిమాంశ్‌ను మెరుగైన వైద్యం కోసం మరో ఆసుపత్రికి తరలిస్తుండగా మధ్యాహ్నం మూడు గంటల సమయంలో మార్గమధ్యలోనే మృతి చెందినట్లు పోలీసులు తెలిపారు.

కారు డ్రైవర్ మాదారపు భాస్కర్‌రావు అతివేగంగా, నిర్లక్ష్యంగా వాహనం నడపడం వల్లే ప్రమాదం జరిగిందని బాలుడి తండ్రి ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై సుధాకర్ తెలిపారు.

Leave a Reply