సమర్థవంతమైన డ్రైనేజీ వ్యవస్థ ఏర్పాటు చేయాలి..

సమర్థవంతమైన డ్రైనేజీ వ్యవస్థ ఏర్పాటు చేయాలి..
ఎమ్మెల్యే మండలి బుద్ధప్రసాద్..
అవనిగడ్డ – ఆంధ్రప్రభ : అవనిగడ్డ పట్టణంలో సమర్థవంతమైన డ్రైనేజీ వ్యవస్థ ఏర్పాటు చేయాలని ఎమ్మెల్యే మండలి బుద్ధప్రసాద్ స్పష్టం చేశారు. బుధవారం అవనిగడ్డలో గ్రామ పంచాయతీ ప్రత్యేక అధికారి తహసీల్దార్ శ్రీనివాసరావు పర్యవేక్షణలో చేపట్టిన డ్రైనేజీ పూడికతీత పనులను ఎమ్మెల్యే పరిశీలించారు.
ప్రధాన రహదారుల్లో పూర్తిగా పూడిపోయి సమస్యాత్మకంగా మారిన డ్రైనేజీలను ప్రత్యేక సిబ్బందితో బాగు చేయిస్తున్నట్లు తహసీల్దార్ తెలిపారు. ప్రభుత్వ కార్యాలయాల ఆవరణలో వర్షపు నీటి ముంపు మళ్ళించేందుకు అనువుగా చర్యలు చేపట్టాలని ఎమ్మెల్యే సూచించారు. కార్యక్రమంలో పంచాయతీ ఈఓ తోట శ్రీనివాసరావు, సిబ్బంది పాల్గొన్నారు.

