2people | అక్కడికక్కడే ఇద్దరు కూలీలు…

2people | అక్కడికక్కడే ఇద్దరు కూలీలు…
2people | ఆంధ్రప్రభ, వెబ్‌డెస్క్ : హైదరాబాద్‌లోని నాచారం పోలీస్‌స్టేషన్ పరిధిలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో ఇద్దరు వ్యక్తులు ప్రాణాలు కోల్పోయారు. మల్లాపూర్‌లోని స్వాగత్ కన్వెన్షన్ సమీపంలో ద్విచక్ర వాహనాన్ని ఓ కారు ఢీకొనడంతో ఈ ప్రమాదం చోటుచేసుకుంది. ప్రమాదంలో బైక్‌పై వెళ్తున్న ఇద్దరూ అక్కడికక్కడే మృతిచెందారు.
సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే సంఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాలను స్వాధీనం చేసుకున్నారు. మృతులను మౌలాలికి చెందిన గణేశ్, గంగాధర్‌గా గుర్తించారు. వీరిద్దరూ రోజువారీ కూలీ పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నట్లు పోలీసులు తెలిపారు.
ప్రమాదానికి అతివేగమే కారణమై ఉండొచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు. ఘటన అనంతరం కారులోని వ్యక్తులు అక్కడి నుంచి పరారైనట్లు సమాచారం. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. కేసు నమోదు చేసిన పోలీసులు నిందితుల కోసం గాలింపు చర్యలు చేపట్టారు. మరోవైపు నాచారం పోలీస్‌స్టేషన్ వద్ద మృతుల కుటుంబ సభ్యులు ఆందోళనకు దిగారు.
