tg | ఇంట్లో యువతి హత్య

tg | ఇంట్లో యువతి హత్య

tg | పాలకుర్తి, ఆంధ్రప్రభ: పెద్దపల్లి జిల్లా పాలకుర్తి మండలం పూట్నూర్ గ్రామానికి చెందిన బౌతు సుమలత(30) ఇంట్లో హత్యకు గురైన ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపింది. గ్రామంలో జరిగిన ఈ ఘటనతో స్థానికులు భయాందోళనకు గురయ్యారు. సమాచారం అందుకున్న బసంత్‌నగర్ ఎస్ఐ నూతి శ్రీధర్ సిబ్బందితో కలిసి వెంటనే ఘటనాస్థలానికి చేరుకుని మృతదేహాన్ని పరిశీలించారు. ఇంటి పరిసరాలను పరిశీలించిన పోలీసులు ఘటనకు సంబంధించిన ఆధారాలను సేకరిస్తున్నారు. ప్రాథమిక సమాచారం మేరకు సుమలత అనుమానాస్పద పరిస్థితుల్లో మృతిగా కనిపించడంతో పోలీసులు హత్య కోణంలో దర్యాప్తు ప్రారంభించినట్లు తెలుస్తోంది. ఘటనకు గల కారణాలపై పోలీసులు ఆరా తీస్తున్నారు. కుటుంబ సభ్యులు, బంధువులు, పరిచయస్తులను విచారిస్తూ కుటుంబ వివాదాలు, వ్యక్తిగత విభేదాలు లేదా ఇతర కారణాలేమైనా ఉన్నాయా అనే కోణంలో విచారణ కొనసాగిస్తున్నాట్లు తెలుస్తోంది. యువతి మృతికి గల అసలు కారణాలు, హత్యకు సంబంధించిన పూర్తి వివరాలు పూర్తిగా తెలియాల్సి ఉంది.

Leave a Reply