86 Runs I కుప్పకూలిన ఆరెంజ్ ఆర్మీ.. గుజరాత్ ఘన విజయం

86 Runs I కుప్పకూలిన ఆరెంజ్ ఆర్మీ.. గుజరాత్ ఘన విజయం
86 Runs I ఆంధ్రప్రభ, వెబ్ డెస్క్: అహ్మదాబాద్ వేదికగా జరిగిన ఐపీఎల్-2026 మ్యాచ్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్ ఘోర పరాజయాన్ని మూటగట్టుకుంది. గుజరాత్ టైటాన్స్ పేసర్ల ధాటికి ఆరెంజ్ ఆర్మీ కేవలం 86 పరుగులకే కుప్పకూలిపోయింది మొదట బ్యాటింగ్ చేసిన గుజరాత్ జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 168 పరుగులు చేసింది. 169 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన సన్‌రైజర్స్‌కు ఆదిలోనే చుక్కెదురైంది. గుజరాత్ పేసర్ల విజృంభణతో తొలి ఓవర్ల నుంచే కీలక వికెట్లు కోల్పోయి హైదరాబాద్ కష్టాల్లో పడింది. ప్రధాన బ్యాటర్లందరూ వరుసగా పెవిలియన్ చేరారు.
ట్రావిస్ హెడ్: 0 రన్స్, అభిషేక్ శర్మ: 6 రన్స్, ఇషాన్: 11 రన్స్, సామ్ కర్రన్: 9 రన్స్, హెన్రిచ్ క్లాసెన్: 14 రన్స్. సలీల్ అరోరా: 16 రన్స్, నితీష్ కుమార్ రెడ్డి: 2 రన్స్ చేశారు. కమిన్స్ నేతృత్వంలోని హైదరాబాద్ జట్టు ఏ దశలోనూ కోలుకోలేక కేవలం 86 పరుగులకే ఆలౌట్ అయింది. దీంతో గుజరాత్ టైటాన్స్ అహ్మదాబాద్ మైదానంలో ఘన విజయాన్ని అందుకుంది.
