రాష్ట్ర మహిళా కమిషన్ మెంబర్ గా కాసోజు శంకరమ్మ

రాష్ట్ర మహిళా కమిషన్ మెంబర్ గా కాసోజు శంకరమ్మ

  • శ్రీకాంతాచారి తల్లికి గౌరవ పదవి అందించిన కాంగ్రెస్ ప్రభుత్వం

, ఆంద్రప్రభ: తెలంగాణ రాష్ట్ర మహిళా కమిషన్ మెంబర్ గా యాదాద్రి భువనగిరి జిల్లా మోత్కూర్ మండలం పొడిచేడు గ్రామానికి చెందిన కాసోజు శంకరమ్మ ని నియమిస్తూ సోమవారం రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఉత్తర్వులు జారీ చేశారు. మహిళా కమిషన్ చైర్మన్ గా గద్వాల విజయలక్ష్మి తో పాటు మరో ఆరుగురు రాష్ట్ర కమిటీ సభ్యులను నియమించగా శంకరమ్మ కి చోటుకల్పించారు.తెలంగాణ మలిదశ ఉద్యమ తొలి అమరుడు కాసోజు శ్రీకాంతాచారి తల్లి శంకరమ్మ శ్రీకాంతాచారి మరణం అనంతరం బీఆర్ఎస్‌ పార్టీలో కొనసాగారు. హుజూర్ నగర్ నుండి ఎమ్మెల్యే గా పోటీ చేసి ఓటమి పాలయ్యారు. అనంతరం కేసీఆర్ ఆమె ని హుజూర్ నగర్ నియోజకవర్గ ఇంచార్జ్ గా నియమించారు.

ఎమ్మెల్సీ పదవి ఆశించినప్పటికి కేసీఆర్ ప్రభుత్వంలో ఆమెకు ఎలాంటి పదవి ఇవ్వలేదు.2023 సాధారణ ఎన్నికలకు ముందు బీఆర్ఎస్‌ పార్టీలో అమరుల కుటుంబాలకు ప్రాధాన్యత ఇవ్వడం లేదని బీఆర్ఎస్‌ పార్ట్ వీడి శంకరమ్మ రేవంత్ రెడ్డి సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు. ప్రస్తుతం కాంగ్రెస్ ప్రభుత్వం లో రాష్ట్ర మహిళా కమిషన్ మెంబర్ గా తనను నియమించడం పట్ల సీఎం రేవంత్, పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్,ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి, ప్రభుత్వ విప్ బీర్ల అయిలయ్య,ఎమ్మెల్యే మందుల సామెల్ కి ఆమె ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.

Leave a Reply