మహిళల అందరికి మథర్స్ డే శుభాకాంక్షలు.

మహిళల అందరికి మథర్స్ డే శుభాకాంక్షలు.

పాయకాపురం, ఆంధ్రప్రభ : విజయవాడ సెంట్రల్ నియోజకవర్గ పరిధిలోని పలు డివిజన్లలో సెంట్రల్ ఎమ్మెల్యే బొండా ఉమామహేశ్వరరావు చిన కుమారుడు రవితేజ జన్మదిన వేడుకలు స్థానిక64వ డివిజన్ కండ్రికలోని టీడీపీ కార్యాలయంలో టీడీపీ అధ్యక్షుడు కె. రవికుమార్, కమిటీ సభ్యులు ఆధ్వర్యంలో ఆదివారం ఘనంగా నిర్వహించారు.ఈ కార్యక్రమంలో టీడీపీ యువ నాయకుడు, ప్రముఖ న్యాయవాది రవితేజ పాల్గొని టీడీపీ అధ్యక్షుడు కె. రవికుమార్తో కలసి కేక్ కటింగ్ నిర్వహించారు.

అనంతరం ప్రతి సంవత్సరం వేసవి కాలంలో ఏర్పాటు చేసే మజ్జిగ పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభించి,పాదాచారులకు మజ్జిగ పంపిణీ చేశారు. నెలరోజుల పాటు నిర్వహించే బృహత్తర కార్యక్రమానికి ఉపయోగించే వాటర్ కూలర్ను రవితేజ ప్రారంభించి ప్రజలకు అందుబాటులో తీసుకుని వచ్చారు.ఈ సందర్భంగా రవితేజ మాట్లాడుతూ ఒక సాధారణ కుటుంబం నుండి వచ్చిన బొండా ఉమాను సెంట్రల్ ప్రజలు తమ కుటుంబంలో ఒకనిగా చేర్చుకొని, జరిగిన ఎన్నికల్లో అత్యదిక మెజార్టీతో గెలిపించిన విషయాన్ని గుర్తు చేశారు.

ప్రజల ఆశయాలకు అనుగుణంగా ఎమ్మెల్యే బొండా ఉమా నిత్యం ప్రజలకు అందుబాటులో ఉంటూ, ప్రభుత్వం నుండి వచ్చే అనేక సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకొని వెళ్తున్నారని అన్నారు. ఆయన అడుగుజాడల్లో మేము కూడా ప్రజలకు చేతనంత సహాయ సహకారాలు అందిస్తున్నామని అన్నారు. రానున్న రోజులలో కూటమి బలోపేతానికి మరింత కృషి చేస్తామని అన్నారు. ఈ సందర్భంగా మనిషి పుట్టుకకు కారణంఐన మహిళా తల్లులకు మథర్స్ డే శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో స్థానిక 64వ డివిజన్ టీడీపీ అధ్యక్షుడు కె. రవికుమార్,ప్రధాన కార్యదర్శి ఎస్.కె బాబు, కోమరి రాజేష్, బాబు తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply