pm modi| కాసేపట్లో మోదీ రాక
బేగంపేట విమానాశ్రయంలో స్వాగత ఏర్పాట్లు
ఆంధ్రప్రభ వెబ్‌డెస్క్ : తెలంగాణ పర్యటనలో భాగంగా కాసేపట్లో హైదరాబాద్‌లోని బేగంపేట ఎయిర్‌పోర్ట్‌కు పీఎం నరేంద్ర మోదీ రానున్నారు. ప్రత్యేక విమానంలో వచ్చే ఆయనకు ఘనస్వాగతం పలికేందుకు బీజేపీ శ్రేణులు సిద్ధమయ్యాయి. ప్రధాని మోదీకి స్వాగతం పలకడానికి డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రులు పొన్నం ప్రభాకర్, అజారుద్దీన్, ఎంపీలు ఈటల, ధర్మపురి అర్వింద్, రఘునందన్‌రావులు బేగంపేట విమానాశ్రయానికి చేరుకున్నారు. హైదరాబాద్‌లో ప్రధాని పర్యటన దృష్ట్యా భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. ఎస్పీజీ వలయంలో బేగంపేట విమానాశ్రయం ఉండగా, పాసులు ఉన్నవారినే విమానాశ్రయానికి అనుమతిస్తున్నారు. ప్రధానికి స్వాగతం పలికేందుకు బీజేపీ నేతలు ఎయిర్‌పోర్టుకు చేరుకున్నారు.
