ఆలయ పునర్‌నిర్మాణ‌పనులను త్వరలో చేపడుతాం

ఆలయ పునర్‌నిర్మాణ‌పనులను త్వరలో చేపడుతాం

రాష్ట్ర దేవదాయశాఖ కమిషనర్

బాసర (నిర్మల్ జిల్లా), ఆంధ్ర‌ప్ర‌భ : నిర్మల్ జిల్లాలోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రం చదువుల తల్లి కొలువైన బాసర శ్రీ జ్ఞాన సరస్వతి దేవి అమ్మవారి సన్నిధిలో రాష్ట్ర దేవదాయ శాఖ మంత్రి హనుమంతరావు జిల్లా కలెక్టర్ భ్రవేశ కుమార్, ఇంజనీరింగ్ అధికారులు విస్తృతంగా పర్యటించారు. గత నెల ఆరున రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి డిప్యూటీ ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క ఇతర మంత్రులచే ఆలయ పునర్నిర్మాణానికి భూమి పూజ చేశారు.

దీంతో బాసర ఆలయ పునర్నిర్మానం చేపట్టేందుకుగాను రాష్ట్ర దేవదాయశాఖ కమిషనర్‌తో పాటు జిల్లా కలెక్టర్ భ్రవేశ కుమార్ ఇతర ఇంజనీరింగ్ అధికారులతో కలిసి ముందుగా బాసర సరస్వతి దేవి అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం ఆలయంలో చేపట్టే మార్పులు చేర్పులను ఆలయ స్థానాచార్యులు ప్రవీణ్ పాటక్, ప్రధాన అర్చకులు సంజీవ్ పూజారి, ఆలయ అధికారులను అడిగి తెలుసుకున్నారు. ఆగమ శాస్త్రాలకు అనుగుణంగా నిర్మాణాలు చేపడతామని ఇంజనీరింగ్ అధికారులు ఆలయ అధికారులు తెలిపారు.

త్వరలోనే టెండర్లను పిలిచి ఆలయ పునర్నిర్మాణ పనులను చేపట్టనున్నట్లు రాష్ట్ర దేవదాయ శాఖ కమిషనర్ తెలిపారు. కార్యక్రమంలో బైంసా సబ్ కలెక్టర్ సంకేత్ కుమార్, ఆలయ ఈవో అంజనేదేవి, తదితరులు ఉన్నారు.

Leave a Reply