నైన్ పాకలో బ్యాడ్మింటన్ ఉచిత శిక్షణ..

చిట్యాల, ఆంధ్రప్రభ : మండలంలోని,నైన్ పాకలో బాల్ బ్యాడ్మింటన్ ఉచిత శిక్షణ(సమ్మర్ క్యాంప్) కొనసాగుతుందని భూపాలపల్లి జిల్లా బాల్ బ్యాడ్మింటన్ అసోసియేషన్ అధ్యక్షులు,చిట్యాల మండలకాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు,గూట్ల తిరుపతి, శనివారం తెలిపారు. అనంతరం ఆయన మాట్లాడుతూ నైన్ పాకలో నిర్వహించిన సమ్మర్ క్యాంపు గూట్ల తిరుపతి, కోచ్ ఉడుతమోహన్ ఆధ్వర్యంలోకొనసాగుతుంద అన్నారు.

సమ్మర్ క్యాంపు లో ఉన్న విద్యార్థులకు ప్రతీ రోజు ఉదయం 6 గంటలకు రన్నింగ్ , వ్యాయామకార్యక్రమం, నిర్వహించడం జరుగుతుందన్నారు. 20 మంది విద్యార్థులు సమ్మర్ క్యాంపులో పాల్గొంటున్నా రన్నారు .క్రీడలు ఆడడం వలన,శారీరక ,మానసిక ఉల్లాసం,క్రమశిక్షణ తో పాటు ఆత్మ విశ్వాసం,జ్ఞాపకశక్తి పెంపొందించడంజరుగుతుందన్నారు.క్రీడలతోచెడుఅలవాట్లకు, మొబైల్ఫోన్ లకు దూరం యువత దూరం అవుతారని పేర్కొన్నారు.

విద్యార్థులు చదువుతోపాట పాటు క్రీడల్లో రాణించాలని, కోరారు. ఆసక్తి గల క్రీడాకారులునైన్ పాక లో నిర్వహించిన బాల్ బ్యాట్మెంటన్, సమ్మర్ క్యాంప్ లో జాయిన్ కావాలని గూట్ల తిరుపతి కోరారు.ఉదయం 6 గంటల నుండి 9.30 గంటల వరకు సాయంత్రం4 గంటల నుండి 6.30 గంటల వరకు శిక్షణ ఉంటుందన్నారు ప్రతిరోజు సమ్మర్ క్యాంపులో ఉన్న విద్యార్థులకు ఉదయం , సాయంత్రంస్నాక్స్అందచేయడం జరుగుతుందని తెలిపారు. పూర్తి వివరాలకు మొబైల్ నెంబర్లు,9666339997, 7337093553,కోచ్ మోహన్ ను సంప్రదించాలని తిరుపతి కోరారు.

Leave a Reply