CollectorAnand | అభివృద్ధిలో ఆనందం – సంక్షేమ సారథి

CollectorAnand | అభివృద్ధిలో ఆనందం – సంక్షేమ సారథి

CollectorAnand | మృదుస్వభావితో ప్రజలకు చేరువైన కలెక్టర్‌ ఆనంద్‌
భూ సమస్యల పరిష్కారంలో వేగవంతమైన చర్యలు
అభివృద్ధి పనులపై నిరంతర మానిటరింగ్‌
నీటి సంరక్షణకు ప్రత్యేక ప్రాధాన్యం
హంద్రీనీవా, హెచ్‌ఎల్‌సీ పనుల వేగవంతం
రైతులు, మత్స్యకారుల అభివృద్ధికి చర్యలు
విద్య, వైద్యం, ఆరోగ్య సదుపాయాల బలోపేతం
టూరిజం అభివృద్ధికి ప్రోత్సాహం

CollectorAnand | అనంతపురం బ్యూరో, ఆంధ్రప్రభ : అనంతపురం జిల్లా కలెక్టర్‌ ఆనంద్‌ మృదుస్వభావి, సౌమ్యుడిగా గుర్తింపు పొందారు. ప్రజల సమస్యలను ఓర్పుతో విని, వేగంగా పరిష్కరించే దిశగా చర్యలు తీసుకుంటూ, అధికార-ప్రతిపక్షాలకు అతీతంగా న్యాయం చేయడానికి కృషి చేస్తున్నారు. కలెక్టర్ గా బాధ్యతలు స్వీకరించిన తర్వాత పెండింగ్‌లో ఉన్న భూ సమస్యలను పరిష్కరిస్తూ, పరిపాలనలో తనదైన ముద్ర వేస్తున్నారు.

జిల్లాలో సంక్షేమం, అభివృద్ధి కార్యక్రమాలను సమాంతరంగా ముందుకు తీసుకెళ్తూ జిల్లా యంత్రాంగాన్ని సమన్వయం చేస్తున్నారు. ముఖ్యమంత్రి మార్గదర్శకాలకు అనుగుణంగా విభాగాల వారీగా సమావేశాలు నిర్వహించి, అభివృద్ధి పనులను వేగవంతం చేస్తున్నారు. ప్రతి అంశాన్ని నిరంతరం మానిటరింగ్‌ చేస్తూ రాష్ట్ర అభివృద్ధిలో భాగస్వామిగా నిలుస్తున్నారు.

వర్షాభావ పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని నీటి సంరక్షణపై ప్రత్యేక శ్రద్ధ పెట్టారు. స్లప ఛానల్‌ పునరుద్ధరణ, కాలువల తవ్వకాలు, హంద్రీనీవా, హెచ్‌ఎల్‌సీ పనులు, చెరువుల మరమ్మత్తులు వంటి చర్యలు చేపట్టారు. అలాగే తాగునీటి పథకాల కార్మికులకు వేతనాలు అందేలా చర్యలు తీసుకుని, నీటి సరఫరా వ్యవస్థను బలోపేతం చేశారు.

రైతాంగం, మత్స్యకారుల అభివృద్ధికి కూడా ప్రాధాన్యత ఇస్తున్నారు. పండ్ల తోటల మార్కెటింగ్‌ సదుపాయాలు మెరుగుపరచడంతో పాటు-, మత్స్యకారులకు ఉపాధి అవకాశాలు కల్పించే చర్యలు తీసుకున్నారు. గ్రామీణ ప్రాంతాల్లో విద్య, వైద్యం, ఆరోగ్య సౌకర్యాల అభివృద్ధిపై దృష్టి సారిస్తూ, టూరిజం అభివృద్ధికి కూడా ప్రోత్సాహం అందిస్తున్నారు. అభివృద్ధిలో ఆనందం – సంక్షేమ సారథి

అనంతపురం బ్యూరో, ఆంధ్రప్రభ: అనంతపురం జిల్లా కలెక్టర్‌ ఆనంద్‌ మృదుస్వభావి, సౌమ్యుడిగా గుర్తింపు పొందారు. ప్రజల సమస్యలను ఓర్పుతో విని, వేగంగా పరిష్కరించే దిశగా చర్యలు తీసుకుంటూ, అధికార-ప్రతిపక్షాలకు అతీతంగా న్యాయం చేయడానికి కృషి చేస్తున్నారు. కలెక్టర్ గా బాధ్యతలు స్వీకరించిన తర్వాత పెండింగ్‌లో ఉన్న భూ సమస్యలను పరిష్కరిస్తూ, పరిపాలనలో తనదైన ముద్ర వేస్తున్నారు.

జిల్లాలో సంక్షేమం, అభివృద్ధి కార్యక్రమాలను సమాంతరంగా ముందుకు తీసుకెళ్తూ జిల్లా యంత్రాంగాన్ని సమన్వయం చేస్తున్నారు. ముఖ్యమంత్రి మార్గదర్శకాలకు అనుగుణంగా విభాగాల వారీగా సమావేశాలు నిర్వహించి, అభివృద్ధి పనులను వేగవంతం చేస్తున్నారు. ప్రతి అంశాన్ని నిరంతరం మానిటరింగ్‌ చేస్తూ రాష్ట్ర అభివృద్ధిలో భాగస్వామిగా నిలుస్తున్నారు.

వర్షాభావ పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని నీటి సంరక్షణపై ప్రత్యేక శ్రద్ధ పెట్టారు. స్లప ఛానల్‌ పునరుద్ధరణ, కాలువల తవ్వకాలు, హంద్రీనీవా, హెచ్‌ఎల్‌సీ పనులు, చెరువుల మరమ్మత్తులు వంటి చర్యలు చేపట్టారు. అలాగే తాగునీటి పథకాల కార్మికులకు వేతనాలు అందేలా చర్యలు తీసుకుని, నీటి సరఫరా వ్యవస్థను బలోపేతం చేశారు.

రైతాంగం, మత్స్యకారుల అభివృద్ధికి కూడా ప్రాధాన్యత ఇస్తున్నారు. పండ్ల తోటల మార్కెటింగ్‌ సదుపాయాలు మెరుగుపరచడంతో పాటు-, మత్స్యకారులకు ఉపాధి అవకాశాలు కల్పించే చర్యలు తీసుకున్నారు. గ్రామీణ ప్రాంతాల్లో విద్య, వైద్యం, ఆరోగ్య సౌకర్యాల అభివృద్ధిపై దృష్టి సారిస్తూ, టూరిజం అభివృద్ధికి కూడా ప్రోత్సాహం అందిస్తున్నారు.

CLICK HERE TO READ వాట్సాప్‌ గవర్నెన్స్‌లో అనకాపల్లి మూడో స్థానం

CLICK HERE TO READ MORE