చోరీ కేసులో నిందితుల బైక్ ధర్మపురిలో ప్రత్యక్షం…..
చోరీ కేసులో నిందితుల బైక్ ధర్మపురిలో ప్రత్యక్షం…..
ధర్మపురి, ఆంధ్రప్రభ : ఇటీవల కరీంనగర్ పట్టణంలోని పీఎంజే జ్యువెలరీ షాపులో నగలు దొంగలించిన దొంగల బైకులు ధర్మపురిలో ప్రత్యక్షమయ్యాయి. ధర్మపురి పట్టణంలోని పలు సీసీ కెమెరాలు కరీంనగర్ సిసిఎస్ సిఐ ప్రకాష్ ధర్మపురి సీఐ రాంనరసింహారెడ్డి పరిశీలించారు. ధర్మపురి పట్టణంలో గోదావరి తీరాన గల ఇటుక బట్టీల సమీపంలో నిందితులు పల్సర్ ద్విచక్ర వాహనం టిఎస్ 09 ఎఫ్ జి 6876 నెంబర్ గల వాహనాన్ని వదిలి వెళ్ళినట్టు పోలీసులు గుర్తించారు.

బైక్‌ను క్లూస్ టీం సీఐ శ్రీధర్, కరీంనగర్ సిసిఎస్ సిఐ ప్రకాష్ లు క్షుణ్ణంగా పరిశీలించి వివరాలు సేకరిస్తున్నారు. విచారణ వేగవంతం చేశారు. ధర్మపురికి రెండు ద్విచక్ర వాహనాల పై 5గురు వ్యక్తులు వచ్చినట్లు సిసి కెమెరాల్లో రికార్డ్ అయ్యాయి. చుట్టుపక్కల ప్రాంతాల్లో, గ్రామాల్లో పోలీసులు పరిశీలిస్తున్నారు.


