పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం
పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం
చిట్యాల, ఆంధ్రప్రభ: చిట్యాల మండలం పెద్దకాపర్తి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో 2000- 2001 సంవత్సరంలో పదవ తరగతి వరకు చదివి 25 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా పాఠశాల ఆవరణంలో పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనాన్ని నిర్వహించడం జరిగింది. చదువు చెప్పిన ఉపాధ్యాయులను సన్మానించారు. ఈ కార్యక్రమంలో ప్రధానోపాధ్యాయులు శ్రీధర్, ఉపాధ్యాయులు ఆగయ్య, అమరేందర్ రెడ్డి,యాదయ్య, యాదగిరి, పుష్పగిరి, చంద్రశేఖర రావు, రామ్మూర్తి, అంజయ్య, శ్రీరాములు, చంద్రశేఖర్,విద్యార్థినీ విద్యార్థులు రాఘవేందర్, మల్లేష్, రాజు, నరసింహ, రమేష్, శివశంకర్ రెడ్డి, కవిత, స్వప్న, అలివేలు తదితరులు పాల్గొన్నారు.
