ప్రమాదవశాత్తు కాలిపోయిన పంట పొలాలను పరిశీలన…
ప్రమాదవశాత్తు కాలిపోయిన పంట పొలాలను పరిశీలన…
వత్సవాయి, ఆంధ్రప్రభ : మండల పరిధిలోని డబ్బాకుపల్లి గ్రామానికి చెందిన రైతులు తూముల అప్పారావు, వారి సోదరులకు చెందిన 32 ఎకరాల మొక్కజొన్న పంట పొలం, అలాగే గ్రామంలోని మరో 14 మంది రైతులకు చెందిన 19 ఎకరాల సుబాబులు పంట పొలాలు ప్రమాదవశాత్తు సంభవించిన అగ్నిప్రమాదంలో పూర్తిగా కాలిపోయాయి.ఈ ఘటనపై స్థానిక నాయకుల ద్వారా సమాచారం అందుకున్న శాసనసభ్యులు & తెలుగుదేశం పార్టీ పొలిట్ బ్యూరో సభ్యులు శ్రీరాం రాజగోపాల్ (తాతయ్య) వెంటనే డబ్బాకుపల్లి గ్రామానికి చేరుకుని, స్థానిక నాయకులతో కలిసి అగ్నిప్రమాదానికి గురైన పంట పొలాలను పరిశీలించారు.
బాధిత రైతులతో మాట్లాడి, జరిగిన నష్టాన్ని అడిగి తెలుసుకుని, వారికి అన్ని విధాలా అండగా ఉంటానని భరోసా కల్పించారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే శ్రీరాం రాజగోపాల్ (తాతయ్య) మాట్లాడుతూ ప్రమాదవశాత్తు పంటలు అగ్నికి ఆహుతి కావడం బాధాకరమని అన్నారు. రైతులు అధైర్యపడవద్దని, ప్రభుత్వం, పార్టీ తరఫున అన్ని విధాలుగా అండగా ఉంటామని భరోసా ఇచ్చారు.
జరిగిన నష్టంపై సంబంధిత అధికారులతో మాట్లాడి, బాధిత రైతులకు తగిన పరిహారం అందేలా చర్యలు తీసుకుంటామని తెలిపారు. రైతుల సంక్షేమమే తమ ప్రభుత్వ లక్ష్యమని, ప్రతి రైతుకు ఎల్లప్పుడూ తోడుగా ఉంటామని ఎమ్మెల్యే పేర్కొన్నారు..ఈ కార్యక్రమంలో వత్సవాయి మండల తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు వడ్లమూడి రాంబాబు, డబ్బాకుపల్లి పిఎసిఎస్ అధ్యక్షులు పెంటేల శ్రీనివాసరావు, వెచ్చ శ్యాము, కె.ఎల్ రావు, గ్రామ తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు మన్నేపల్లి నరసింహారావు, మేడేపల్లి ఫ్రాన్సిస్, కట్ట నవీన్, మునగాల వంశి, భోగేశ్వర రావు తదితరులు పాల్గొన్నారు.
