కడెం నారాయణరెడ్డి ప్రాజెక్టును సందర్శించిన కలెక్టర్

కడెం, ఆంధ్రప్రభ : నిర్మల్ జిల్లా కలెక్టర్ భావేష్ మిశ్రా కడెం నారాయణరెడ్డి ప్రాజెక్టును సందర్శించారు. ఈ సందర్భంగా పెద్దూరు, కడెం గ్రామ సర్పంచ్ దీకొండ విజయకుమార్ కలెక్టర్‌ను కలిసి, కడెం ప్రాజెక్టుకు సంబంధించిన అభివృద్ధి పనులు, అలాగే కడెం–పెద్దూరు గ్రామాల సమగ్ర అభివృద్ధికి ప్రత్యేక నిధులు మంజూరు చేయాలని విజ్ఞప్తి చేశారు.

ఈ సందర్భంగా సర్పంచ్ దీకొండ విజయకుమార్ కలెక్టర్ భావేష్ మిశ్రాకు శాలువా కప్పి ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో నీటిపారుదల శాఖ, రెవెన్యూ శాఖ అధికారులు పాల్గొన్నారు.