దమ్మపేట మండల టాపర్ నాగుపల్లి విద్యార్థిని మాన్విత

దమ్మపేట మండల టాపర్ నాగుపల్లి విద్యార్థిని మాన్విత
దమ్మపేట, ఆంధ్రప్రభ : తెలంగాణ రాష్ట్రంలో 10 వ తరగతి పరీక్షా ఫలితాలను బుధవారం ఎస్ఎస్ఎస్ సి బోర్డు ప్రకటించింది .దమ్మపేట మండలంలోని ఎనిమిది జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో మొత్తం 277 మంది విద్యార్థులు పరీక్షలు వ్రాయగా 275 మంది విద్యార్థులు ఉత్తీర్ణత సాధించినట్లు దమ్మపేట మండల విద్యాధికారి జగపతి తెలిపారు.
దమ్మపేట మండలపరిధిలోని నాగుపల్లి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల కు చెందిన ఎం. మాన్విత 571 మార్కులతో మండలంలో టాపర్ గా నిలిచింది .మల్కారం పాఠశాలకు చెందిన లక్ష్మి రిషి 559 మార్కులతో ద్వితీయ, దమ్మపేట పాఠశాలకు కు చెందిన సుహానా 558 మార్కులతో తృతీయ స్థానంలో నిలిచారు . నాగుపల్లి పాఠశాలకు చెందిన మాన్వితను ఆ పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు బజ్జూరి సరళ విద్యార్థినికి స్వీట్ తినిపించి అభినందించారు .
