Road Accident | ఆరుగురు మహిళలు మృతి

Road Accident | ఆరుగురు మహిళలు మృతి

Road Accident | ఆంధ్రప్రభ, వెబ్ డెస్క్ : గుజరాత్‌లోని సబర్కాంత జిల్లాలో బుధవారం ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. అతివేగంగా వచ్చిన ఓ ప్రైవేటు బస్సు ప్రయాణికులతో వెళ్తున్న వ్యాన్‌ను ఢీకొట్టడంతో ఆరుగురు మహిళలు అక్కడికక్కడే మృతిచెందారు. మరో ఎనిమిది మంది తీవ్రంగా గాయపడ్డారు.

ప్రమాదం జరిగిన వెంటనే స్థానికులు, పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. గాయపడిన వారిని సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. క్షతగాత్రుల్లో ముగ్గురి పరిస్థితి విషమంగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు. దీంతో మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని అధికారులు పేర్కొన్నారు. బస్సు డ్రైవర్ అజాగ్రత్తగా, అతివేగంగా నడపడం వల్లే ఈ ప్రమాదం జరిగినట్లు పోలీసులు ప్రాథమికంగా నిర్ధారించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు కొనసాగిస్తున్నారు.