టీబీ నిర్మూలనకు సమగ్ర చర్యలు

టీబీ నిర్మూలనకు సమగ్ర చర్యలు

-జిల్లా కలెక్టర్ డా. ఏ. సిరి

కర్నూలు బ్యూరో, ఆంధ్రప్రభ: టీబీ నిర్మూలనకు సమగ్ర చర్యలు చేపడుతుందని పోషకాహారం, చికిత్సపై ప్రత్యేక దృష్టి సారిస్తుందని జిల్లా కలెక్టర్ డాక్టర్ ఏ. సిరి పేర్కొన్నారు. సోమవారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో జాతీయ క్షయ నిర్మూలన కార్యక్రమం పరిధిలో, ప్రధానమంత్రి టీబీ ముక్త్ భారత్ అభియాన్‌లో భాగంగా గ్రీన్ కో సంస్థ ఆధ్వర్యంలో రోగులకు పోషకాహార ఫుడ్ కిట్లను జిల్లా కలెక్టర్ అధ్యక్షతన పంపిణీ చేశారు.

ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ…జిల్లాలో క్షయ వ్యాధి (టీబీ) నిర్మూనలో బాగంగా గ్రీన్ కో సంస్థ వారి ఆధ్వర్యంలో 455 మంది రోగులకు పోషకాహార ఫుడ్ కిట్లను అందజేయడం జరిగిందని టీబీ రోగులకు ప్రభుత్వం ఆరు నెలలపాటు నిరంతర చికిత్స అందజేస్తోందని తెలిపారు. రోగుల రోగనిరోధక శక్తి (ఇమ్యూనిటీ) పెంపు కోసం సరైన మందులు, సమయానికి చికిత్సతో పాటు సమతుల్య ఆహారం అత్యంత కీలకమని పేర్కొన్నారు.

టీబీ నియంత్రణలో పోషకాహారం ప్రధాన పాత్ర పోషిస్తుందని, ఈ దిశగా సహకారం అందించిన గ్రీన్ కో యాజమాన్యానికి కృతజ్ఞతలు తెలిపారు. భవిష్యత్తులో కూడా ఇలాంటి సేవా కార్యక్రమాలను మరింత విస్తరించాలని ఆకాంక్షించారు. అదేవిధంగా, పేషంట్స్ అందుకున్న ఫుడ్ కిట్లను సక్రమంగా వినియోగించుకోవాలని, వృథా చేయకుండా ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ వహించాలని సూచించారు. నిర్దేశిత కాలంలో పూర్తి చికిత్స తీసుకుంటే టి.బి పూర్తిగా నయం అవుతుందని, ప్రతి రోగి వైద్యుల సూచనలు ఖచ్చితంగా పాటించాలని కోరారు. జిల్లాలో టి.బి నిర్మూలన లక్ష్యాన్ని సాధించేందుకు ప్రభుత్వం, వైద్యశాఖ, స్వచ్ఛంద సంస్థలు సమన్వయంతో పనిచేస్తున్నాయని తెలిపారు.

ఈ కార్యక్రమంలో డిఎంహెచ్వో డాక్టర్ కామేశ్వర ప్రసాద్, డిస్టిక్ లెప్రసీ, ఎయిడ్స్ , టీబీ కంట్రోలర్ అధికారి డాక్టర్ భాస్కర్, గ్రీన్ – కో సంస్థ డిప్యూటీ డైరెక్టర్ ఏ.ఎస్ నాయుడు, జిల్లా క్లస్టర్ హెడ్ బడేషావలి, సీనియర్ జనరల్ మేనేజర్ శరత్ చంద్ర తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply