గోసంరక్షణ పై తహసీల్దార్ కు వినతిపత్రం అందజేత

గోసంరక్షణ పై తహసీల్దార్ కు వినతిపత్రం అందజేత
సిరికొండ, ఆంధ్రప్రభ: సిరికొండ మీదుగా గోవుల అక్రమ రవాణా జరుగుతున్నందున, గోసంరక్షణ కొరకు చర్యలు తీసుకోవాలని సోమవారం సిరికొండ తహసీల్దార్ బి. రవిందర్ రావుకు బీజేపీ నాయకులు వినతిపత్రం అందించారు. అనంతరం వారు మాట్లాడుతూ… గోసమ్మాన్, ఆహ్వాన్ అభియాన్ కార్యక్రమంలో భాగంగా గో సంరక్షణకు తగిన చర్యలు తీసుకోవాలని వినతిపత్రం అందించినట్లు వారు తెలిపారు. వాటికీ సంబంధించిన కొన్ని ముఖ్య పత్రాలను తహసీల్దార్ కు అందించినట్లు వారు పేర్కొన్నారు.
గోసంరక్షణకు రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు తగిన చర్యలు తీసుకోవాలని కొన్ని డిమాండ్లతో కూడిన వినతి పత్రాన్ని కూడా తహసీల్దార్ కు అందించినట్లు వారు చెప్పారు. గోమాత రక్షణ కొరకు కఠిన చట్టాలు తీసుకు రావాలి, గోమాతకు జాతీయ స్థాయిలో తగిన గుర్తింపు కల్పించాలి, గోవుల రక్షణ కొరకు ప్రత్యేక మంత్రిత్వ శాఖ ఏర్పాటు చేయాలి, తెలంగాణ రాష్ట్రంలో రాష్ట్ర రాజ్యమాతగా ప్రకటించాలి, గోవుల అక్రమ రవాణా వాటి సంవారాన్ని నిషేధించాలనె డిమాండ్లతో కూడిన వినతి పత్రాన్ని తహసీల్దార్ కు అందించినట్లు వివరించారు. అలాగే మేము ఇచ్చిన వినతి పత్రాలను భారత దేశ ప్రధానమంత్రి రాష్ట్రపతిలకు పంపించాలని తహసీల్దార్‌ను కోరినట్లు వారు తెలిపారు. ఈ కార్యక్రమంలో బీజేపీ మండల ప్రధాన కార్యదర్శి ధర్పల్లి బాబురావు, బిజెపి నాయకులు బచ్చు మారుతీ, జంగం బాబురావు తదితరులు పాల్గొన్నారు.
