ఉపాధ్యాయుల ఎక్స్పోజర్ విజిట్ సక్సెస్..

ఉపాధ్యాయుల ఎక్స్పోజర్ విజిట్ సక్సెస్..
- ఫిన్లాండ్ నుంచి స్వదేశానికి తిరిగి వచ్చిన ఉపాధ్యాయులు..
జన్నారం,ఆంధ్రప్రభ : రాష్ట్ర ప్రభుత్వం తరఫున పిన్లాండ్ లోని విద్యా విధానాన్ని అధ్యయనం చేయడానికి వెళ్లిన ఉపాధ్యాయుల, అధికారుల ఎక్స్పోజర్ విజిట్ సక్సెస్ అయింది.ఆదివారం సాయంత్రం హైదరాబాద్ విమానశ్రయం చేరుకున్న వారందరికీ ప్రభుత్వం తరఫున అధికారులు స్వాగతం పలికారు. రాష్ట్రంలోని అధికారుల, ఉపాధ్యాయులతో పాటు మంచిర్యాల జిల్లాలోని జైపూర్ ఎంఈఓ బి.శ్రీనివాస్,జన్నారం మండలంలోని కిష్టాపూర్ హైస్కూల్ ఉపాధ్యాయుడు దాముక కమలాకర్,మండలంలోని పొనకల్ అక్కపల్లిగూడ ఎంపీఎస్ ఉపాధ్యాయుడు జాజాల శ్రీనివాస్,ఆదిలాబాద్ జిల్లాలోని ఏమాయికుంట ఎంపీఎస్ ఉపాధ్యాయుడు బి. గంగయ్య లు ఫిన్లాండ్ నుంచి 5 రోజుల విద్య పర్యటన ముగించుకొని హైదరాబాద్ తిరిగి వచ్చారు.

ఈ సందర్భంగా వారు ఫోన్లో మాట్లాడుతూ,పిన్లాండ్ లోని విద్యార్థులకు ఎలాంటి ఒత్తిడి లేని తక్కువ హోంవర్క్ ఎక్కువ ప్రాక్టికల్స్ విధానంతో విద్యాబోధన చేస్తున్నారన్నారు.పిన్లాండ్ లోని హెల్సింకి ప్రముఖ పాఠశాలలను,యూనివర్సిటీ ఆఫ్ హెల్సింకిని, హెల్సింకి ట్రైనింగ్ స్కూల్‌ను సందర్శించామని వారు తెలిపారు.అధ్యయనం చేసి,పరిశీలించిన అక్కడి విద్యా విధానంపై వెళ్లి వచ్చిన అధికారులందరితో కలిసి ప్రణాళిక తయారు చేసి ప్రభుత్వానికి అందజేయనున్నట్లు వారు చెప్పారు.ఈ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డికి,రాష్ట్ర విద్యాశాఖ ఉన్నతాధికార్లకు,జిల్లా కలెక్టర్,విద్యాశాఖ అధికారి,ఇతర అధికార్లకు వారు కృతజ్ఞతలు తెలిపారు.
