L&T | నిర్వ‌హ‌ణ‌కు సిద్ధ‌మైన తెలంగాణ ప్ర‌భుత్వం

L&T | నిర్వ‌హ‌ణ‌కు సిద్ధ‌మైన తెలంగాణ ప్ర‌భుత్వం

L&T | ఆంధ్ర‌ప్ర‌భ వెబ్ డెస్క్ : హైద‌రాబాద్ మెట్రో ట్రైన్ నిర్వ‌హ‌ణ‌పై ప్ర‌భుత్వం కీల‌క నిర్ణ‌యం తీసుకుంది. హైదరాబాద్ మెట్రో రైల్ ప్రాజెక్టును పూర్తిగా ప్రభుత్వ ఆధీనంలోకి తీసుకునేందుకు సిద్ధ‌మైంది. మే1 నుంచి మెట్రో రైలు నిర్వ‌హ‌ణ‌ను త‌మ చేతిలోకి తీసుకోవాల‌ని స‌ర్కార్ నిర్ణ‌యించింది. ఎల్ అండ్ టీ చేతిలో ఉన్న వాటాలన్నీ స్వాధీనం చేసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరు ఎల్ అండ్ టీ సంస్థ‌కు రూ.15వేల కోట్లు చెల్లించేందుకు డీల్ కుదుర్చుకునేందుకు ఏర్పాట్లు చేసుకుంటుంది.

ఈ మార్పుల నేపథ్యంలో మెట్రో రైల్ బోర్డులో ప్ర‌భుత్వం కీలక నియామకాలు చేప‌ట్టింది. హైద‌రాబాద్ మెట్రో రైలు నిర్వ‌హ‌ణ‌కు 10మందితో క‌మిటీ ఏర్పాటు చేసింది. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణరావును బోర్డు చైర్మన్‌గా నియమించింది. మెట్రో ఎండీగా సర్ఫరాజ్ అహ్మద్ కొనసాగనున్నారు. అలాగే బోర్డు డైరెక్టర్లుగా జయేశ్ రంజన్, వికాస్ రాజ్, ఫైనాన్స్ సెక్రటరీ సుల్తానియా, అలాగే శివధర్ రెడ్డిని తెలంగాణ సర్కార్ నియమించింది.

Leave a Reply