Amazon |అమెజాన్ డెలివరీ బాయ్..

Amazon | అమెజాన్ డెలివరీ బాయ్..

  • పోక్సో కేసు నమోదు
  • ఆదిభట్ల పోలీస్ స్టేషన్ పరిధిలో ఘటన

Amazon | ఇబ్రహీంపట్నం రూరల్, ఆంధ్రప్రభ : పన్నెండేళ్ళ ఓ మైనర్ బాలికతో, అమెజాన్ డెలివరీ బాయ్ అసభ్యంగా ప్రవర్తించిన ఘటన ఆదిభట్ల పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. నల్గొండ జిల్లా, త్రిపురారం మండలంకు చెందిన రమావత్ విష్ణువర్ధన్ బాబు (19), ఆదిభట్ల పోలీస్ స్టేషన్ పరిధిలోని నాదర్గుల్ లో అమెజాన్ డెలివరీ బాయ్ గా పనిచేస్తూ, మేఘన బాయ్స్ హాస్టల్, తుర్కయంజాల్ లో నివాసం ఉంటున్నాడు.

విధుల్లో భాగంగా నాదర్గుల్ లో డెలివరీ ఇవ్వడానికి అని వెళ్ళాడు. కాగా అక్కడ ఉన్న ఓ మైనర్ బాలిక(12) తో అసభ్యంగా ప్రవర్తించాడని బాధిత కుటుంబ సభ్యుల నుండి ఫిర్యాదు అందడంతో సదరు వ్యక్తి పై పోక్సో కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.

Leave a Reply