Samyuktha menon | అలాంటి నిర్ణయం తీసుకుందా..?

Samyuktha menon | అలాంటి నిర్ణయం తీసుకుందా..?

Samyuktha menon | సంయుక్త కెరీర్ పీక్ లో.. వరుస విజయాలు
వైరల్ అవుతున్న మ్యారేజ్ రూమర్స్
స్వయంభు మూవీతో బిజీ షెడ్యూల్
పెళ్లిపై క్లారిటీ కోసం అభిమానుల ఎదురు చూపు

Samyuktha menon | ఆంధ్రప్రభ వెబ్ డెస్క్ : సౌత్ సినీ ఇండస్ట్రీలో తన నటనతో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న మలయాళ ముద్దుగుమ్మ సంయుక్త మీనన్. తెలుగులో సినిమాలు చేయడం స్టార్ట్ చేసినప్పటి నుంచి అమ్మడికి వరుసగా ఆఫర్స్ రావడంతో బాగా బిజీ అయ్యింది. ఇప్పుడు కెరీర్ పీక్ స్టేజ్ లో ఉంది. ఇలాంటి టైమ్ లో సంయుక్త పెళ్లి చేసుకోబోతుందనే వార్త ప్రచారంలోకి రావడం ఆసక్తిగా మారింది. ఇంతకీ.. సంయుక్త నిజంగానే పెళ్లి చేసుకోబోతుందా..? ఇక ఇది గాసిప్పా..?

Samyuktha menon

Samyuktha menon | సంయుక్త నటిస్తే.. బ్లాక్ బస్టరే..

సంయుక్త మీనన్ భీమ్లా నాయక్, సార్, బింబిసార.. తదితర చిత్రాలతో వరుసగా సక్సెస్ సాధించింది. దీంతో సంయుక్త నటిస్తే.. ఆ సినిమా బ్లాక్ బస్టరే అనేట్టుగా పేరు తెచ్చుకుంది. విరూపాక్ష మూవీలో అయితే.. అభినయంతో అదరగొట్టింది. దీంతో సంయుక్త గ్లామర్ రోల్స్ మాత్రమే కాదు.. పర్ ఫార్మెన్స్ రోల్స్ తో కూడా మెప్పిస్తుందనే పేరు తెచ్చుకుంది. ఇదిలా ఉంటే.. ఈ బ్యూటీ పెళ్లి వార్తలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ముఖ్యంగా తెలుగు ప్రేక్షకులకు చేరువైన తర్వాత ఆమె వ్యక్తిగత జీవితంపై ఆసక్తి మరింత పెరిగింది.

Samyuktha menon

Samyuktha menon | వైరలైన సంయుక్త మ్యారేజ్ న్యూస్..

ఇటీవల కొన్ని సోషల్ మీడియా పోస్టులు, ఇండస్ట్రీ వర్గాల గుసగుసల నేపథ్యంలో సంయుక్త త్వరలోనే వివాహం చేసుకోబోతుందని.. ఈ ఇయర్ లో ఖచ్చితంగా పెళ్లి చేసుకుంటుందని.. ప్రచారం ఊపందుకుంది. అయితే, ఈ వార్తలపై సంయుక్త లేదా ఆమె కుటుంబ సభ్యులు ఇప్పటి వరకు ఎలాంటి అధికారిక ప్రకటన చేయలేదు. ప్రస్తుతం సంయుక్త మీనన్ స్వయంభు సినిమాలో నటించింది. నిఖిల్ నటించిన ఈ సినిమా మే నెలలో ప్రేక్షకుల ముందుకు రానుందని సమాచారం. ఈ సినిమా పై నిఖిల్ చాలా ఆశలు పెట్టుకున్నాడు. ఈ మూవీ తనకు మరింత పేరు తీసుకువస్తుందని సంయుక్త గట్టి నమ్మకంతో ఉంది. అలాగే పూరి డైరెక్షన్ లో స్లమ్ డాగ్ మూవీలో కూడా నటించింది.

Samyuktha menon

Samyuktha menon | నిజంగానే పెళ్లి చేసుకుంటుందా..?

సంయుక్త మీనన్ ప్రస్తుతం తన కెరీర్‌పైనే దృష్టి సారించినట్లు తెలుస్తోంది. వరుసగా సినిమాలు చేస్తూ బిజీగా ఉన్న ఈ హీరోయిన్, ముఖ్యంగా తెలుగు చిత్రాల్లో మంచి అవకాశాలు దక్కించుకుంటోంది. కథకు ప్రాధాన్యం ఉన్న పాత్రలను ఎంపిక చేసుకుంటూ నటిగా తనకంటూ ప్రత్యేక స్థానాన్ని ఏర్పరుచుకుంది. పెద్ది స్పెషల్ సాంగ్ లో సంయుక్త మీనన్ నటించనున్నట్టుగా ప్రచారం జరుగుతుంది. ఇదిలా ఉంటే.. కెరీర్ పీక్స్ లో ఉన్న ఈ టైమ్ లో సంయుక్త పెళ్లి చేసుకోవాలని ఎందుకు నిర్ణయం తీసుకుంటుంది..? ఇదేదో గాసిప్ అవ్వచ్చు అని నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు. అయితే.. పెళ్లి వార్త మాత్రం గట్టిగా వినిపిస్తోంది. మరి.. ఈ మలయాళ ముద్దుగుమ్మ క్లారిటీ ఇస్తుందేమో చూడాలి.

Samyuktha menon

Leave a Reply