IPL | నేడు గుజ‌రాత్‌, ముంబై ఢీ

IPL | నేడు గుజ‌రాత్‌, ముంబై ఢీ

IPL |ఆంధ్ర‌ప్ర‌భ వెబ్‌డెస్క్ : ఐపీఎల్ 2026లో ఇవాళ మరో ఆసక్తికర పోరు జ‌ర‌గ‌నుంది. అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియంలో గుజరాత్ టైటాన్స్- ముంబై ఇండియన్స్ జట్లు తలపడనున్నాయి. రాత్రి 7:30 గంటలకు జరిగే ఈ మ్యాచ్ లైవ్‌ను స్టార్ స్పోర్ట్స్, జియో హాట్ స్టార్ వేదికగా వీక్షించొచ్చు. ఈ రోజు జ‌రిగే మ్యాచ్ ముంబైకి ‘చావో రేవో’ మ్యాచ్‌గా చెప్పొచ్చు. తొలి మ్యాచ్‌లో గెలిచిన ముంబై జ‌ట్టు తర్వాత వరుసగా నాలుగు ఓటములు చ‌విచూసింది. స్టార్ ప్లేయర్లు ఉన్నప్పటికీ జట్టు విజయాలు సాధించ‌డంలో వెనుక‌బ‌డింది. ఆట‌గాళ్లు కూడా అనుకున్న స్థాయిలో ప్రదర్శన చేయలేకపోతున్నారు. ఈ మ్యాచ్‌లో గెలవకపోతే ముంబై జ‌ట్టుకు ప్లే ఆఫ్స్ అవకాశాలు దాదాపు ముగిసిపోయే అవ‌కాశం ఉంది.

ఇక గుజ‌రాత్ జ‌ట్టు వ‌రుస విజ‌యాలు సాధిస్తోంది. సీజన్ ప్రారంభంలో వరుసగా రెండు ఓటములు చవిచూసిన గుజరాత్ టైటాన్స్, ఆ తర్వాత అద్భుతంగా పుంజుకుని వరుసగా మూడు విజయాలు సాధించి దూసుకుపోతుంది. జట్టు మంచి ఫామ్‌లో ఉంది. బ్యాటింగ్, బౌలింగ్ రెండింటిలోనూ రాణిస్తోంది. కెప్టెన్ శుభమన్ గిల్ నాయకత్వంలో జట్టు అన్ని ఆల్‌రౌండ్ షో చేస్తోంది.

ఐపీఎల్‌లో రెండు జ‌ట్ల హెడ్ టు హెడ్ రికార్డులను ప‌రిశీలిస్తే.. గుజరాత్ టైటాన్స్ జట్టే ఆధిక్యంలో ఉంది. ఇరు జట్లు 8 మ్యాచ్‌లలో తలపడితే గుజరాత్ టైటాన్స్ 5 మ్యాచ్‌లలో విజయం సాధిస్తే, ముంబై ఇండియన్స్ మూడింటిలోనే గెలిచింది.

గుజరాత్ టైటాన్స్ జట్టు అంచనా
శుభ్‌మన్ గిల్ (కెప్టెన్), సాయి సుదర్శన్, జోస్ బట్లర్, గ్లెన్ ఫిలిప్స్, వాషింగ్టన్ సుందర్, రాహుల్ తెవాటియా, షారూఖ్ ఖాన్, రషీద్ ఖాన్, అశోక్ శర్మ, కగిసో రబడా, మొహమ్మద్ సిరాజ్, ప్రసిద్ధ్ కృష్ణ.

ముంబై ఇండియన్స్ జట్టు అంచనా
ర్యాన్ రికెల్టన్, క్వింటన్ డికాక్, సూర్యకుమార్ యాదవ్, నమన్ ధీర్, హార్దిక్ పాండ్యా, షెర్ఫేన్ రూధర్‌ఫోర్డ్, తిలక్ వర్మ, మయాంక్ రావత్, శార్ధూల్ ఠాకూర్, దీపక్ చాహర్, జస్ప్రీత్ బుమ్రా, ఘజన్‌ఫర్.

Leave a Reply