ఘనంగా సీఎం చంద్రబాబు జన్మదిన వేడుకలు
బాపట్ల టౌన్, ఆంధ్రప్రభ ; ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు జన్మదిన సందర్భంగా హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తున్నట్లు తెదేపా బాపట్ల పట్టణ అధ్యక్షులు గొలపల శ్రీనివాసరావు తెలిపారు. స్థానిక శాసనసభ్యులు వేగేశన నరేంద్ర వర్మ రాజు వ్యక్తిగత విదేశీ పర్యటనలో ఉన్న నేపథ్యంలో ఆయన ఆదేశాల మేరకు బాపట్ల తెదేపా నియోజకవర్గ క్యాంపు కార్యాలయంలో సీఎం జన్మదిన వేడుకలు పట్టణ అధ్యక్షుడు గోలపల శ్రీనివాసరావు ఆధ్వర్యంలో ఘనంగా జరిగాయి.
వేలాదిమంది కార్యకర్తలతో కలిసి కేకును కోసి కార్యకర్తల నోరు తీపి చేసి సీఎంకు జన్మదిన శుభాకాంక్షలు శ్రీనివాసరావు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజాసేవ పట్ల ఆయనకు ఉన్న అంకితభావం ప్రతి ఏడాది మరింత బలపడుతూ రాష్ట్ర అభివృద్ధికి దోహదపడుతోందని అన్నారు. తన అనుభవం, దూరదృష్టి, పరిపాలనా నైపుణ్యంతో రాష్ట్రాన్ని అభివృద్ధి దిశగా నడిపిస్తున్న గొప్ప నాయకుడిగా ఆయన నిలిచారని పేర్కొన్నారు. ఆయన ఆలోచనా స్పష్టత, పట్టుదల, ప్రజల పట్ల అచంచల నిబద్ధత అనేక మందికి ప్రేరణగా నిలుస్తున్నాయని తెలిపారు.
ఆయన నాయకత్వంలో రాష్ట్రం మరింత అభివృద్ధి సాధించాలని ఆకాంక్షిస్తూ, ఆయనకు ఆయురారోగ్యాలు, దీర్ఘాయుష్షు కలగాలని కోరుకుంటూ మరోసారి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. తెలుగుదేశం పార్టీ నాయకులు అంగలకుదురు సత్యం, దారా అశోక్, సురగాని శేఖర్, ధర్మేందర్ రెడ్డి, కొల్లూరి వెంకట్రావు, బావుడా చైర్మన్, మహిళ నాయకురాలు, తదితరులు పాల్గొన్నారు.
