ధాన్యాన్ని ప్రభుత్వ కొనుగోలు కేంద్రాలలో అమ్మాలి…

ధాన్యాన్ని ప్రభుత్వ కొనుగోలు కేంద్రాలలో అమ్మాలి…
గిట్టుబాటు ధరను పొందాలి..
మార్కెట్ చైర్మన్ ఉబ్బు వెంకటయ్య
చౌటుప్పల్, ఆంధ్రప్రభ : రైతులు ఆరుగాలం కష్టపడి పండించిన ధాన్యం ను ప్రభుత్వం ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాలలో అమ్మి గిట్టుబాటు ధరను పొందాలని చౌటుప్పల్ మార్కెట్ చైర్మన్ ఉబ్బు వెంకటయ్య తెలిపారు. చౌటుప్పల్ మండలంలోని స్వాములవారి లింగోటం, మందోళ్లగూడెం, నేలపట్ల, అంకిరెడ్డిగూడెం, పంతంగి, గుండ్ల బావి గ్రామాలలో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఆదివారం మార్కెట్ వైస్ చైర్మన్ ఆకుల ఇంద్రసేనారెడ్డి తో కలిసి చైర్మన్ వెంకటయ్య ప్రారంభించారు.
ఈ సందర్భంగా చైర్మన్ వెంకటయ్య మాట్లాడుతూ రైతులు మధ్య దళారులను నమ్మి మోసపోవద్దని, ప్రభుత్వం నాణ్యమైన ఏ గ్రేడ్ రకం ధాన్యముకు రూ. 2,389, బి గ్రేడ్ రకం ధాన్యముకు రూ. 2,369 లు గిట్టుబాటు ధరగా చెల్లించడం జరుగుతుందని, రైతులు తమ ధా న్యమును కల్లాలలోనే శుభ్రం చేసుకుని మార్కెట్లో అమ్ముకొని గిట్టుబాటు ధరను పొందాలన్నారు. ఎండలు తీవ్రంగా ఉన్నందున రైతులు, హమాలీలు తగిన జాగ్రత్త తీసుకోవాలన్నారు.
ఈ కార్యక్రమంలో మండల వ్యవసాయ అధికారి ముత్యాల నాగరాజు, సింగిల్ విండో కార్యదర్శి వై రమేష్, స్వాములవారి లింగోటం గ్రామ సర్పంచ్ భీమిడి ప్రదీప్ జీ, మందుళ్ళగూడెం గ్రామ సర్పంచ్ తంగెళ్ల వెంకటేశం, గంగాపురం వసంత నగేష్ గౌడ్, జై కేసారం గ్రామ సర్పంచ్ సమిరెడ్డి భారతమ్మ జనార్దన్ రెడ్డి, సుర్వి మల్లేష్ గౌడ్, కాకి శ్రీలత సుందరయ్య, నందగిరి వెంకటేశం, సింగిల్ విండో మాజీ వైస్ చైర్మన్ చెన్నగోని అంజయ్య, దేవస్థాన కమిటీ చైర్మన్ కుర్నాల వెంకటేష్, ఉప సర్పంచ్ బాతరాజు ధనంజయ, పాల సంగం చైర్మన్ ఆకుల లక్ష్మమ్మ అశోక్, మార్కెట్ కమిటీ సభ్యులు బోయ వెంకటేష్, పబ్బు శ్రీకాంత్ గౌడ్, సప్పిడి సంజీవరెడ్డి, ఎస్ లింగోటం మాజీ ఉప సర్పంచ్ గంగాపురం గంగాధర్, నాయకులు బోడిగే ఆనంద్, బాతరాజు వెంకటేష్, వార్డు మెంబర్లు పిట్టల శోభ సదానందం, బాతరాజు పద్మ పక్కీర్, రాధారపు సత్తయ్య, చేగురి లింగస్వామి, ఉప్పు వీరేశం, బాతరాజు లింగస్వామి, చెన్నగోని సుశీల వెంకటేశం, తూర్పింటి సుజాత యాదయ్య తదితరులు పాల్గొన్నారు.
