మోరంగపల్లిలో సంఘటన…

మోరంగపల్లిలో సంఘటన…

పిడుగు పడి ఎద్దు మృతి…

వికారాబాద్, ఆంధ్రప్రభ : ఈదురు గాలులు, భారీ వర్షానికి ఆదివారం సాయంత్రం వికారాబాద్ జిల్లా మోమినుపేట్ మండలం మోరంగపల్లి గ్రామంలో పశువులపాకలో కట్టేసిన ఎద్దుపై పిడుగు పడి ఎద్దు మృతి చెందిన సంఘటన చోటుచేసుకుంది. ఇందుకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి.

మురంగపల్లి గ్రామమునకు చెందిన మంగలి రాములుకు చెందిన ఎద్దు పశువుల పాకలో కట్టేసి ఉండగా సాయంత్రంలో ఈదురుగాలులు, వర్షం భారీగా కురవ‌డంతో పిడుగు పడి ఎద్దు అక్కడికి అక్కడే మరణించింది. ఎద్దు మృతి చెందిన విషయం తెలుసుకున్న రైతు మంగళాభులు కన్నీరు అయ్యారు. గ్రామస్తులు స్పందించి ప్రభుత్వం రైతును ఆదుకోవాలని ఎద్దు విలువ దాదాపు రూ.60,000 ఉంటుంద‌ని పేర్కొన్నారు. గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేశారు.

Leave a Reply