సర్దార్ గౌతు లచ్చన్న సేవలు ఎనలేనిది….

సర్దార్ గౌతు లచ్చన్న సేవలు ఎనలేనిది….

పాయకాపురం, ఆంధ్రప్రభ : సింగ్ నగర్లోని సెంట్రల్ నియోజకవర్గ ఎమ్మెల్యే కార్యాలయం వద్ద సెంట్రల్ నియోజకవర్గ గౌడ సంగం ఆధ్వర్యంలో స్వాతంత్య్ర సమరయోధుడు, రైతు ఉద్యమకారుడు, సంఘ సంస్కర్త గౌతు లచ్చన్న 20వ వర్ధంతి కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ప్రభుత్వ విప్, సెంట్రల్ నియోజకవర్గ శాసనసభ్యుడు బొండా ఉమ మహేశ్వర రావు పాల్గొని సర్దార్ గౌతు లచ్చన్న చిత్రపటానికి పూలమాల వేసి ఘన నివాళులు అర్పించారు.

సర్దార్ గౌతు లచ్చన్న గారి జీవితం నేటి రాజకీయ నాయకులకు, ప్రజాప్రతినిధులకు, యువతకు ఒక మార్గదర్శకమని పేర్కొన్నారు. స్వాతంత్య్ర సమర కాలంలో ఆయన చేసిన త్యాగాలు, పోరాటాలు దేశ చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోయాయని అన్నారు. రైతు సమస్యలను సమగ్రంగా అర్థం చేసుకుని, రైతుల హక్కుల కోసం అహర్నిశలు పోరాడిన మహనీయుడిగా ఆయన గుర్తింపు పొందారని తెలిపారు.

ఈ కార్యక్రమంలో సెంట్రల్ నియోజకవర్గ కోఆర్డినేటర్ నవనీతం సాంబశివరావు, మాజీ కార్పొరేటర్ పిరియ జగదాంబ సోమేశ్వరరావు, కూర్మపు దుర్గారావు, సింగం వెంకన్న,మరకా శ్రీనివాస్ యాదవ్, డోల జనార్ధన్, సుర్విపల్లి అమర్నాథ్ గౌడ్, బెజవాడ తిరుపతి గౌడ్, పలగాని శివ, తదితరులు పాల్గొన్నారు.

పైపులా రోడ్డు సెంటర్లో..

స్థానిక పైపులా రోడ్డు సెంటర్లో పాదచారుల దాహార్తిని తీర్చడానికి సెంట్రల్ ఎమ్మెల్యే బొండా ఉమామహేశ్వరరావు ఆదివారం మజ్జిగ పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు ఆకుల సూర్యప్రకాష్, దాసరి కనకరావు, పిరియా సోమేశ్వరర్రావు, కూర్మపు దుర్గారావు తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply