Road accident | ద్విచక్ర వాహనంపై వెళ్తుండగా…

Road accident | ద్విచక్ర వాహనంపై వెళ్తుండగా…
Road accident | వి.కోట, ఆంధ్రప్రభ : మండల పరిధిలోని ఓగు గ్రామం వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో ద్విచక్ర వాహనదారుడు అక్కడికక్కడే మృతి చెందాడు. స్థానికుల కథనం ప్రకారం.. వీకోట వైపు ద్విచక్ర వాహనంపై వస్తున్న వ్యక్తిని ఎదురుగా వేగంగా వచ్చిన కారు ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన అతను అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు.

మృతుడు రామకుప్పం మండలం బల్ధారు గ్రామానికి చెందిన వ్యక్తిగా గుర్తించారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని మృతదేహాన్ని పోస్టుమార్టంకు పలమనేరుకు తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ప్రమాదానికి గురైన కారు డ్రైవర్ పరారీలో ఉన్నాడు.
