తాగునీటి సమస్య లేకుండా ప్రత్యేక చర్యలు

తాగునీటి సమస్య లేకుండా ప్రత్యేక చర్యలు
హుజూర్నగర్, ఆంధ్రప్రభ : హుజూర్నగర్ మున్సిపల్ పరిధిలో అన్ని వార్డుల్లో ప్రజలకు వేసవిలో తాగునీటి సరఫరా విషయంలో అంతరాయాలు లేకుండా ప్రత్యేక చర్యలు తీసుకుంటామని మున్సిపల్ చైర్మన్ దొంతగాని శ్రీనివాస్ అన్నారు. కౌన్సిల్ సమావేశంలో వార్డ్ కౌన్సిలర్స్ ఆయా వార్డుల్లో నెలకొన్న సమస్యలు పరిష్కరించాలని.. ప్రధానంగా వేసవిలో తాగునీటి సరఫరా విషయంలో అంతరాయాలు లేకుండా చూడాలని కోరారు.
ఈ సందర్భంగా మున్సిపల్ చైర్మన్ దొంతగాని శ్రీనివాస్ వైస్ చైర్మన్ తన్నీరు మల్లికార్జున్ లు మాట్లాడుతూ.. వేసవి కాలంను ధృష్టిలో ఉంచుకొని త్రాగునీటి సమస్యలు తలెత్తకుండా ఉండేంధుకు సమస్యలు తెలుసుకొని మిషన్ భగీరధ నీటి సరఫరా చేస్తున్నాం. అన్ని వార్డులలో ఉన్న వీధి దీపాలు సరిగా వెలుగుతున్నాయా..? లేదా ఎప్పటికప్పుడు తెలుసుకుంటున్నాం. ఇతర సమస్యలు పరిష్కరించేందుకు కృషి చేస్తున్నామని అన్నారు.
రాబోయే వర్షాకాలంను ధృష్టిలో ఉంచుకొని భారీ వర్షాలు కురిసినప్పుడు పట్టణ పరిధిలో ఎటువంటి ఇబ్బందులు కలగుండ ఉండేంధుకు వర్షపు నీరు ప్రవహించుటకు వీలుగా నీరు ప్రవహించు మార్గాలకు పూడికలు తీసి వేయడం.. దిశ నిర్ధేశ మార్గాల గురించి చర్చించాం. మున్సిపల్ పరిధిలో పలు అభివృద్ది కార్యక్రమముల కొరకు కౌన్సిల్ ముందు ప్రవేశ పెట్టి తీర్మానించి ఆమోదించటం జరిగిందన్నారు. ఈ సమావేశంలో మున్సిపల్ కమిషనర్ బి. శ్రీనివాస్, ఏఈ వినోద్, శానిటరీ ఇన్స్పెక్టర్ అశోక్, కౌన్సిలర్స్ అన్ని విభాగాల అధికారులు సిబ్బంది పాల్గొన్నారు.
