మెండోరాలో వరి ధాన్యం కొనుగోలు కేంద్రం ప్రారంభం

భీమ్‌గల్ రూరల్, ఆంధ్రప్రభ : ప్రభుత్వ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలను రైతులు సద్వినియోగం చేసుకోవాలని గ్రామ సర్పంచ్ కుంట లక్ష్మి రమేష్ తెలిపారు.
భీమ్‌గల్ మండలం మెండోరా గ్రామంలో శనివారం ఐకేపీ ఆధ్వర్యంలో వరి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ఆయన ముఖ్య అతిథిగా హాజరై, స్థానిక నాయకులతో కలిసి కొబ్బరికాయ కొట్టి ప్రారంభించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, రైతులు తమ వరి ధాన్యాన్ని నేరుగా ప్రభుత్వానికి విక్రయించుకునే అవకాశాన్ని ఈ కేంద్రం కల్పిస్తుందని చెప్పారు. మధ్యవర్తులను ఆశ్రయించకుండా నేరుగా కొనుగోలు కేంద్రానికి ధాన్యం తీసుకురావాలని సూచించారు. ప్రభుత్వం నిర్ణయించిన కనీస మద్దతు ధర (ఎంఎస్పీ) ప్రకారం ధాన్యం కొనుగోలు జరుగుతుందని తెలిపారు.
రైతులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అన్ని ఏర్పాట్లు చేసినట్లు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఐకేపీ ఏపీఎం ప్రమీల, ఐకేపీ సీసీ గడాల రఘుపతి, పంచాయతీ సెక్రటరీ ప్రశాంత్, గ్రామ పాలకవర్గ సభ్యులు, వీడీసీ సభ్యులు రాజేందర్, గంగాధర్, మాజీ ఎంపీటీసీ ఆరే రవీందర్, మహిళా సంఘాల సభ్యులు, రైతులు తదితరులు పాల్గొన్నారు.
