BRS | కేటీఆర్, హరీశ్‌రావు పర్యవేక్షణ

BRS | కేటీఆర్, హరీశ్‌రావు పర్యవేక్షణ
BRS | ఆంధ్రప్రభ వెబ్‌డెస్క్ : జగిత్యాలలో కేసీఆర్ సభా ఏర్పాట్లను ఇవాళ బీఆర్ఎస్ సీనియర్ నేతలు కేటీఆర్, హరీశ్‌రావు పరిశీలించారు. జగిత్యాల వివేకానంద మినీ స్టేడియంలో ఈనెల 20న జరిగే బీఆర్ఎస్ బహిరంగ సభలో కేసీఆర్ పాల్గొననున్నారు. ఈ సభలోనే సీనియర్ నేత జీవన్‌రెడ్డి బీఆర్ఎస్లోకి చేరనున్నారు. ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ.. జగిత్యాలలో ఒక పండగ వాతావరణం కనబడుతుందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. కేసీఆర్ ఇక్కడికి వస్తున్నారంటే… కోరుట్ల నుంచి రాకుండా ఇప్పుడు రోడ్డు తవ్వుతున్నారని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. గతంలో ఎన్నో బహిరంగసభలు నిర్వహించామని, ఇది కూడా విజయవంతమవుతుందన్నారు. ఈనెల 20న జరిగే సభ కోసం 3 లక్షల నీళ్ల బాటిల్స్, 2 లక్షల మజ్జిగ ప్యాకెట్లు కూడా ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు.



