24 hours |10 నెలల బాలుడి కిడ్నాప్ కేసు చేధన

24 hours | 10 నెలల బాలుడి కిడ్నాప్ కేసు చేధన

  • 24 గంటల్లో కేసు చేధించిన కృష్ణా జిల్లా పోలీసులు

24 hours | మచిలీపట్నం – ఆంధ్రప్రభ : పెనమలూరు నియోజకవర్గంలో శుక్రవారం 10 నెలల బాలుడు కిడ్నాప్ అయ్యాడు. ఈ కేసును ఎస్పీ విద్యా సాగర్ నాయుడు పర్యవేక్షణలో ఆరు టీమ్ లుగా ఏర్పడి బాలుడి కిడ్నాప్ 24 గంటల్లో కృష్ణాజిల్లా పోలీసులు చేధించారు. మచిలీపట్నంలో బాలుడిని రూ.1,50,000లకు కొనుగోలు చేసిన పిల్లలు లేని దంపతులను, బాలుడిని విక్రయించిన వాల్లు విజయవాడ వాంబే కాలనీకి చెందినవారిగా పోలీసులు గుర్తించారు.

బాలుడి విక్రయం ఘటనలో ఏడుగురి ప్రమేయం ఉన్నట్లు గుర్తించిన పోలీసులు వారిని అదుపులోకి తీసుకున్నారు. 24 గంటల్లో కేసు పరిష్కారం చేసిన ఎస్పీకి జిల్లా ప్రజలు అభినందనలు తెలుపుతున్నారు.

Leave a Reply