153 mobiles | చోరీకి గురైన 153 మొబైల్ ఫోన్ల రికవరీ

153 mobiles | చోరీకి గురైన 153 మొబైల్ ఫోన్ల రికవరీ

  • బాధితులకు అందజేసిన జిల్లా ఎస్పీ.

153 mobiles | బాపట్ల క్రైమ్, ఆంధ్రప్రభ : బాపట్ల జిల్లా పోలీసు యంత్రాంగం మరోసారి అద్భుత ప్రతిభను కనబరిచింది. నాలుగు నెలలుగా జిల్లాలో వివిధ పోలీస్ స్టేషన్ల పరిధిలో పోగొట్టుకున్న, చోరీకి గురైన 153 మొబైల్ ఫోన్లను సాంకేతిక పరిజ్ఞానంతో పోలీసులు రికవరీ చేశారు. వీటి విలువ సుమారు రూ. 30 లక్షల 80 వేల రూపాయలు ఉంటుందని అంచనా. ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో రికవరీ చేసిన ఫోన్లను బాధితులకు ఎస్పీ ఉమామహేశ్వర్ స్వయంగా అందజేశారు. జిల్లా ఐటీ కోర్ టీమ్, స్థానిక పోలీసులు సమన్వయంతో సెంట్రల్ ఎక్విప్మెంట్ ఐడెంటిటీ రిజిస్టర్ పోర్టల్, ఇతర అధునాతన సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించి ఈ ఫోన్లను గుర్తించారు.

రికవరీ ప్రక్రియలో కీలక పాత్ర పోషించిన ఐటీ టీమ్, పోలీసు అధికారుల సమర్థవంతమైన పనితీరును ఎస్పీ ప్రత్యేకంగా అభినందించారు. తమ విలువైన ఫోన్లను, అందులోని వ్యక్తిగత సమాచారాన్ని తిరిగి పొందిన బాధితులు బాపట్ల జిల్లా పోలీసులకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. ఫోన్ పోగొట్టుకున్న వారు వెంటనే సిఈఐఆర్ పోర్టల్ ద్వారా ఫిర్యాదు చేయాలని, తద్వారా ఫోన్ డేటా దుర్వినియోగం కాకుండా బ్లాక్ చేయవచ్చని ఎస్పీ తెలిపారు.

153 mobiles |
153 mobiles |

65 శాతం చోరికి గురైన మొబైల్స్ రికవరీ చేయడం జరిగిందని, 100 శాతం రికవరీ చేసేందుకు యంత్రాంగం కృషి చేస్తుందని వెల్లడించారు. అలాగే, బిల్లులు లేని సెకండ్ హ్యాండ్ ఫోన్లను కొనుగోలు చేసి అనవసర చిక్కుల్లో పడవద్దని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. ఏ ఆర్ డి ఎస్ పి టి జగదీష్ నాయక్, చీరాల డీఎస్పీ మొహమ్మద్ మెయిన్, బాపట్ల డీఎస్పీ సి హెచ్ చంద్రమౌళి, రేపల్లె డీఎస్పీ ఆవుల శ్రీనివాసరావు, సిబ్బంది, బాధితులు, తదితరులు పాల్గొన్నారు.

153 mobiles |
153 mobiles |
153 mobiles |
153 mobiles |

CLICK HERE TO READ MORE : Fatal incident | భార్య కాలు నరికిన భర్త…

CLICK HERE TO READ MORE :

Leave a Reply