వేం నరేందర్ రెడ్డికి శుభాకాంక్షలు తెలిపిన డాక్టర్ బొల్లపల్లి కృష్ణ

వేం నరేందర్ రెడ్డికి శుభాకాంక్షలు తెలిపిన డాక్టర్ బొల్లపల్లి కృష్ణ

రఘునాథపల్లి, ఆంధ్రప్రభ : తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రాజకీయ సలహాదారులుగా ఉన్న వేం నరేందర్ రెడ్డి గురువారం రాజ్యసభ సభ్యునిగా ప్రమాణ స్వీకారం చేసిన సందర్భంగా జనగామ జిల్లా స్టేషన్ ఘనపూర్ నియోజకవర్గ కాంగ్రెస్ నాయకులు డాక్టర్ బొల్లపల్లి కృష్ణ మర్యాదపూర్వకంగా కలిసి పుష్పగుచ్చం అందించి శుభాకాంక్షలు తెలిపారు.

డాక్టర్ కృష్ణ మాట్లాడుతూ కష్టపడే ప్రతి ఒక్కరికి కాంగ్రెస్ పార్టీలో ప్రత్యేక గుర్తింపు ఉంటుందని అందుకు నిదర్శనం వేం నరేందర్ రెడ్డి అని ఆయన అన్నారు. నరేందర్ రెడ్డి రాజ్యసభ సభ్యులుగా నియామకం కావడం పట్ల ఆయన హర్షం వ్యక్తం చేశారు.

Leave a Reply