Registrar Office | విజిలెన్స్ తనిఖీలు

Registrar Office | విజిలెన్స్ తనిఖీలు

Registrar Office | కరీంనగర్, ఆంధ్రప్రభ : జిల్లా రిజిస్టార్ కార్యాలయంలో విజిలెన్స్ అధికారులు ఆకస్మిక తనిఖీలు చేపట్టారు. గురువారం కరీంనగర్ జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్ ఆవరణలో ఉన్న రిజిస్టార్ కార్యాలయంలో తనిఖీల్లో భాగంగా రికార్డులను పరిశీలించారు. రిజిస్టార్ కార్యాలయాల్లో అవకతవకలు జరుగుతున్నాయని వచ్చిన ఫిర్యాదుల మేరకు ఉమ్మడి కరీంనగర్ జిల్లాలోని పలు కార్యాలయాల్లో విజిలెన్స్ అధికారులు తనిఖీలు నిర్వహిస్తున్నారు.

కార్యాలయంలోని రికార్డులను క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. తనిఖీల్లో కరీంనగర్ విజిలెన్స్ ఎస్పి శ్రీనివాసరావు తో పాటు విజిలెన్స్ అధికారులు పాల్గొన్నారు.

Register Office
Register Office |

Leave a Reply